Home /News /international /

OMG WOMAN BREAST SIZE INCEASES AFTER TAKING PFIZER COVID VACCINE IN UK VIDEO GOES VIRAL SK

OMG: కరోనా టీకా వేసుకున్నాక.. పెరుగుతున్న వక్షోజాల సైజు.. ఆమె శరీరంలో అనూహ్య మార్పు

కరోనా టీకా వేసుకున్నాక.. పెరిగిన వక్షోజాల సైజు.. ఆమె శరీరంలో అనూహ్య మార్పు

కరోనా టీకా వేసుకున్నాక.. పెరిగిన వక్షోజాల సైజు.. ఆమె శరీరంలో అనూహ్య మార్పు

Corona Vaccine: కరోనా టీకా తీసుకున్న తర్వాత తన వక్షజాలు పెద్దగా అవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం (Coronavirus) కొనసాగుతోంది. ఒమిక్రాన్ విజృంభణతో భారత్‌తో పాటు అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లక్షలాది మంది కోవిడ్ బారినపడుతున్నారు. మన దేశంలో కూడా కరోనా కోరలు చాస్తోంది. రోజుకు 3 లక్షలకు పైగానే కొత్త కేసులు (Covid-19 cases in India) వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించే ఏకైక అస్త్రం.. కరోనా టీకా. ఇప్పటికే మన దేశంలో చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ (Corona Vaccine) వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తున్నాయి. ఐతే కరోనా టీకా తీసుకున్న తర్వాత కొందరి శరీరంలో చిత్ర విచిత్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ కూడా షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత తన వక్షజాలు పెద్దగా అవుతున్నాయని పేర్కొంది.

  మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ..ఏం ఘనకార్యం వెలగబెట్టాడో చూడండి

  ది సన్ (The Sun) వెబ్‌సైట్ కథనం ప్రకారం.. టిక్‌టాక్ (Tiktok) యూజర్ ఎల్లే మార్షల్ (Elle Marshall) ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. కరోనా టీకా వేసుకున్న తర్వాత తన శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయని.. వక్షోజాల సైజు పెరిగిందని చెప్పుకొచ్చారు. చాలా కాలంగా తన బ్రా సైజు A కప్ ఉందని.. అంటే వక్షోజాల సైజు చిన్నదిగా ఉండేదని ఆ మహిళ వీడియోలో పేర్కొన్నారు. కానీ ఆమెకు ఫైజర్ కరోనా వ్యాక్సిన్ (pfizer vaccine) తీసుకున్ తర్వాత.. రొమ్ముల పరిమాణం పెరుగుతూ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను C సైజ్ బ్రా వాడుతున్నానని.. అంటే తన వక్షోజాల పరిమాణం రెండు పాయింట్ల మేర పెరిగిందని (Woman Breast size increase after getting vaccine) సదరు మహిళ వివరించారు.

  Trending: డాన్స్ చేసింద‌ని వ‌ధువును చెంపదెబ్బ కొట్టి వ‌రుడు.. త‌ర్వాత ఏం

  తన రొమ్ముల సైజు A కప్ నుంచి C కప్ వరకు పెరగడంతో ఎల్లే మార్షల్ చాలా ఆందోళన చెందుతున్నారు. కరోనా టీకా తన శరీరంలో ఇంకా ఎలాంటి ప్రభావం చూపుతుందోనని టెన్షన్ పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనని కలవరపడుతున్నారు. ఐతే కరోనా టీకా వేసుకున్న తర్వాత వక్షోజాల సైజు పెరిగిందని గతంలోనూ పలువురు మహిళలు చెప్పారు. అంతేకాదు ఎల్లీ వీడియో కింద కామెంట్ రూపంలోనూ కొందరు మహిళలు తమకు ఎదరైన అనుభవాన్ని పంచుకున్నారు. తనకు కూడా అలాగే జరుగుతోందని పలువురు కామెంట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత తమ పీరియడ్స్ విషయంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయని మరికొందరు మహిళలు చెబుతున్నారు.

  Pak pilot: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. షిఫ్ట్ టైమ్ పూర్తయిందటూ పైలట్ జంప్..

  ఐదే దీనిపై వైద్యుల వాదన మరోలా ఉంది. పేషెంట్ యాక్సెస్ అనే వెబ్‌సైట్‌కు చెందిన డాక్టర్ సారా జార్విస్ ది సన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ప్లేసిబో ప్రభావం వల్ల కూడా రొమ్ము పరిమాణంతో పాటు పీరియడ్స్‌లో మార్పులు వచ్చినట్లుగా అనిపిస్తాయని పేర్కొన్నారు. ప్లేసిబో ప్రభావం అంటే ఇతరులను చూసే వ్యక్తులు తమకు కూడా అదే అనుభూతి కలిగినట్లుగా భావిస్తారు. స్త్రీలకు రుతుక్రమం ముందుకు వెనుకకు రావడం సర్వసాధారణమని.. కరోనా కంటే ముందు కూడా ఇది చాలా సాధారణమైన విషయమని ఆయన వివరించారు. వక్షోజాల సైజు పెరగడం అనేది ఊబకాయం, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. అంతేతప్ప కరోనా వ్యాక్సిన్‌కి, బ్రెస్ట్ సైజులో మార్పును శాస్త్రీయంగా ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేశారు.

  OMG:కూరగాయలు అమ్ముతున్న కోతి..ఎక్కడో తెలుసా

  కాగా, మన దేశంలోనూ కరోనా విషయంలో ఇలాంటి కొన్ని విచిత్రాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్‌లో ఓ పెరాలిసిస్ పేషెంట్‌.. కరోనా టీకా తీసుకున్నాక కోలుకున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఆ వ్యక్తి శరీరంలో.. కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత కదలికలు వచ్చాయని డాక్టర్లు కూడా చెప్పారు. అంతేకాదు గతంలో అతడికి మాట పడిపోయిందని.. కానీ ఇప్పుడు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసుపై వైద్య నిపుణులు స్టడీ చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Corona Vaccine, COVID-19 vaccine, International news, Trending, Viral Video

  తదుపరి వార్తలు