నడిరోడ్డుపై డాన్స్ ఇరగదీసిన బామ్మ... దుమ్ము రేపుతున్న వైరల్ వీడియో

Viral Dance Video : ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు. ఆ ఏజ్‌లో ఆమె అంత బాగా ఎలా డాన్స్ చేయగలుగుతోందన్నదానిపై నెటిజన్లకు ఆశ్చర్యం కలుగుతోంది.

news18-telugu
Updated: October 10, 2019, 3:04 PM IST
నడిరోడ్డుపై డాన్స్ ఇరగదీసిన బామ్మ... దుమ్ము రేపుతున్న వైరల్ వీడియో
నడిరోడ్డుపై డాన్స్ ఇరగదీసిన భామ (credit - FB - Tree designs)
news18-telugu
Updated: October 10, 2019, 3:04 PM IST
Viral Dance Video Social Media Sensation : 38 లక్షల వ్యూస్, 4లక్షలకు పైగా షేరింగ్స్, 2లక్షలకు పైగా లైక్స్... ఇదీ వైరల్ డాన్స్ వీడియో ట్రాక్ రికార్డ్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని పట్టి కుదిపేసిన వీడియో ఏదైనా ఉందా అంటే... అది ఇదే. దీన్ని చూసిన వాళ్లు అమేజింగ్, అద్భుతం, వావ్, సూపర్, ఇరగదీసింది... ఇలా కామెంట్ల తుఫాన్ కురిపిస్తున్నారు. అంత సీన్ ఏముంది అన్న డౌట్ మీకు రావచ్చు. చాలా మేటర్ ఉంది. ఇందులో దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ టొయోకా... ఓ ఇంగ్లీష్ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. అది కూడా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె స్టెప్స్ వెయ్యడం ఓ విశేషమైతే... ఏమాత్రం తొణకకుండా... ఎలాంటి బెరుకూ లేకుండా... సినిమా హీరోయిన్లను తలదన్నే రేంజ్‌లో చెలరేగిపోవడం సెన్సేషనే.


ఈ డాన్స్ చూసిన తర్వాత చాలా మంది టొయోకాను అడిగారు... ఇంత బాగా ఎలా వెయ్యగలిగారని. ఆమె ఏమందో తెలుసా... తనకు డాన్స్ అంటే ఇష్టమంది. తన డాన్స్‌తో అందర్నీ అలరించడం ఇంకా ఇష్టమంది. అందుకే రిథమిక్ సాంగ్ రాగానే ఆగలేకపోయానని చెప్పింది. ఓ అపరిచిత వ్యక్తి ఆమె డాన్స్‌ని షూట్ చేశాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే... నెటిజన్లు ఫిదా అయ్యారు. తాము చూసి... మిగతా వాళ్లకూ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా లవర్స్ ఇది చూసి... తమ హార్ట్‌బీట్‌కి పంపి... మనం కూడా ఇలా డాన్స్ వెయ్యాలి అంటున్నారు. ఇంకెందుకాలస్యం... మీరూ చూసి ఎంజాయ్ చెయ్యండి.

 

హాట్‌ అందాల శ్రీముఖి... అదిరిపోయిన లేటెస్ట్ ఫొటోషూట్
ఇవి కూడా చదవండి :

Loading...
Health Tips : 3 వెజిటబుల్ సూప్ రెసిపీలు... ఇలా చేసుకోవచ్చు

Health Tips : బీపీ తగ్గాలా... ఈ జ్యూస్ ఓ గ్లాస్ తాగితే సరి...

Health Tips : బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి...

Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...

Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...
First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...