ఆ చేప ఒడ్డుకొస్తే సునామీ వస్తుందా? జపాన్‌ ఎందుకు వణికిపోతోంది?

2010లో సుమారు 10 ఓర్‌ఫిష్‌లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జపాన్ వాసులు భయపడుతున్నారు.

news18-telugu
Updated: February 4, 2019, 6:08 PM IST
ఆ చేప ఒడ్డుకొస్తే సునామీ వస్తుందా? జపాన్‌ ఎందుకు వణికిపోతోంది?
జపాన్ తీరానికి కొట్టుకొచ్చిన ఓర్‌ఫిష్
  • Share this:
ఓ చనిపోయిన చేపను చూసి యావత్ జపాన్ వణికిపోతోంది. దాదాపు 11 మీటర్లుండే ఆ చేప... జపాన్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజుల్లో ఇలాంటివి మూడు చేపలు తీరానికి కొట్టుకురావడంతో... జపాన్ ప్రజల్లో ప్రాణభయం మరింత తీవ్రమైంది. భూకంపం విధ్వంసం సృష్టిస్తుందని హడలెత్తుతున్నారు. సునామీ ముంచెత్తుందన్న భయంతో ప్రాణాలరచేత పట్టుకొని జీవిస్తున్నారు. అసలు ఈ చేపకు సునామీకి లింకేటి?

ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ చేప పేరు ఓర్ విష్. సముద్ర పాముగా కూడా పిలుస్తారు. పొడవాటి శరీరం, ఎర్రటి మొప్పులు, వెండిలా మెరిసే చర్మం కలిగి ఉంటుంది. ఈ చేపను సముద్ర దేవుడి దూతగా భావిస్తారు జపాన్ ప్రజలు. ఇవి నీటి అడుగున 200 మీ. నుంచి కిలోమీటర్ లోతన మాత్రమే ఇవి జీవిస్తాయి. అంత అడుగుభాగాన సంచరించడంతో మత్స్యకారుల వలకు అస్సలు చిక్కవు. ఇలాంటిది ఇటీవల ఓర్‌ఫిష్‌లు వరుసగా ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. తొయామా తీరంలో రెండు ఓర్‌ఫిష్‌లు మత్స్యకారులకు కనిపించాయి. అంతకు ముందు మరో ఐదు చేపలు కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ సీజన్‌లో మొత్తం ఏడు చేపలు కనిపించాయి.

ఓర్‌‌ఫిష్ చేపలు తీరానికి కొట్టుకొచ్చినా...మత్స్యకారుల వలకు చిక్కినా... జపాన్ ప్రజలు భయపడితారు. ఎందుకంటే.. ఇవి తీరానికి వస్తే ఏదో ప్రకృతి విపత్తు సంభవిస్తుందని వాళ్లు విశ్వసిస్తారు. సముద్ర గర్భంలో భూకంపం వస్తే వీటికి ముందే తెలిసిపోతుందట..! సునామీ పరిస్థితులు తలెత్తినా ఓర్‌ఫిష్ చేపలు పసిగడతాయట..! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అవి నీటి పైభాగానికి వస్తాయని జపాన్ వాసులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో తీరానికి భారీ చేపలు కొట్టుకురావడంతో.. మళ్లీ సునామీ వస్తుందేమోనన్న భయంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

2010లో సుమారు 10 ఓర్‌ఫిష్‌లు సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే 2011 మార్చిలో జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. సునామీ విధ్వంసానికి సుమారు 19వేల మంది చనిపోయారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని జపాన్ వాసులు భావిస్తున్నారు. ఐతే అధికారులు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు. సునామీ పరిస్థితులు ఆ చేపలకు ముందే తెలుస్తుందన్న ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు.
View this post on Instagram

#フィールド 昨日、新湊の定置網でリュウグウノツカイが捕獲されました‼️ サイズは394.8cmで、魚津水族館の記録では4番目の大きさです😁 綺麗な個体なので、 2/2(土)と2/3(日)の2日間限定で展示予定です! 展示中はリュウグウノツカイに触ることができるので、どんな触り心地か確かめてみよう✨ #うおすいレア生物 #リュウグウノツカイ #触ると指が銀色になる#タッチOK #幻の魚 #oarfish #deepsea #nature #beautiful #魚 #珍魚 #さかな #魚津水族館公式 #魚津水族館 #水族館 #富山 #uozuaquarium #aquarium #uozuaquariumofficial #限定 #レア #新湊#新湊漁協

A post shared by 魚津水族館 公式 (@uozuaquarium_official) on

Published by: Shiva Kumar Addula
First published: February 4, 2019, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading