యువతి హత్య కేసులో సంచలన తీర్పు... 16 మందికి మరణశిక్ష

Nusrat Jahan Rafi : నస్రత్ జహాన్ హత్య బంగ్లాదేశ్‌ను కుదిపేసింది. ఇప్పుడా కేసులో 16 మంది దోషులకు వెంటనే శిక్ష విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: October 25, 2019, 8:02 AM IST
యువతి హత్య కేసులో సంచలన తీర్పు... 16 మందికి మరణశిక్ష
నస్రత్ జహాన్ హత్య కేసులో సంచలన తీర్పు... 16 మందికి మరణశిక్ష
  • Share this:
Nusrat Jahan Rafi : ఇండియాలో ఇలా జరిగితే... మన కోర్టులు తీవ్రంగానే స్పందిస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనూ మార్పు వచ్చింది. అక్కడ కూడా కోర్టులు తీవ్రంగానే స్పందిస్తున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారని టీచర్‌కి కంప్లైంట్ ఇచ్చిన 19 ఏళ్ల నస్రత్ జహాన్‌ను... వేధింపులకు పాల్పడిన 16 మంది యువకులు కలిసి... పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. బంగ్లాదేశ్‌కి 160 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘోరం జరిగింది. ఏప్రిల్‌లో జరిగిన ఈ దారుణం దావానలంలా వ్యాపించింది. బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. యువత రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ఆందోళనలతో భగ్గుమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఆ తర్వాత పోలీసులు ఆ 16 మందినీ అరెస్టు చేయడం, దర్యాప్తు పూర్తి చేయడం అన్నీ జరిగాయి. ఈ కేసులో తాజాగా బంగ్లాదేశ్ కోర్టు... ఆ 16 మందికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇలాంటి కేసుల్లో దర్యాప్తు కొన్నేళ్లు పడుతుంది. కానీ బంగ్లాదేశ్‌లో ఈ కేసు విషయంలో మాత్రం దర్యాప్తు నెలల్లోనే ముగిసింది. ఈ తీర్పు తర్వాత నస్రత్ తల్లి ఒకింత ఓదార్పు పొందినట్లు ఫీలయ్యారు. ఆ దుర్మార్గులకు మరణశిక్ష పడాల్సిందే అని ఆమె కోరారు. తన కూతురు భరించిన ఆవేదన, బాధ, కష్టం... అన్నీ ఇప్పటికీ తన కళ్ల ముందు కనిపిస్తున్నాయని ఆమె కన్నీరు పెట్టారు.

ఈ ఏడాది మార్చిలో తనను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నా్రని హెడ్‌మాస్టర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది నస్రత్ జహాన్. అది జరిగిన 11 రోజుల తర్వాత... ఐదుగురు వ్యక్తులు బురఖాలు ధరించి ఆమెను రౌండప్ చేశారు. కంప్లైంట్ వెనక్కి తీసుకోమన్నారు. ఆమె ఒప్పుకోకపోయేసరికి... ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.

మొదట్లో ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు డ్రామాలాడారు. ఆమె ఏ కంప్లైంటూ ఇవ్వలేదని నాటకాలాడారు. ఐతే... ఆమె సోదరుడు... ఆమె ఇచ్చిన కంప్లైంట్‌ను సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. అది బయటకు వచ్చేసరికి పోలీసులపై ఉన్నతాధికారుల నుంచీ ఒత్తిడి పెరిగింది. దాంతో కేసు దర్యాప్తు ట్రాక్‌లోకి వచ్చింది.



హత్య చేసిన వారిలో... ఆమె క్లాస్‌మేట్స్, నస్రత్ వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దురదృష్టమేంటంటే... ముగ్గురు టీచర్లు, హెడ్‌మాస్టర్ కూడా ఈ హత్యలో చేతులుకలిపారు. అధికార అవామీ లీక్ పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలకు కూడా ఈ హత్యలో భాగస్వామ్యం ఉందని కోర్టు తేల్చింది.

ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే. ఆ 16 మందికీ వెంటనే శిక్ష అమలు చెయ్యాలని. వాళ్లను ఉరితీస్తేనే... నస్రత్ జహాన్ ఆత్మకు శాంతి కలుగుతుందని వారు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో నస్రత్ జహాన్ లాంటి చాలా మంది అమ్మాయిలు ఇలాగే బలైపోతున్నారు. ఈ కేసు ద్వారా ఆ దేశంలో మార్పు వస్తున్నట్లే కనిపిస్తోంది.

 
Loading...

Pics : ఓరచూపులతో కట్టి పడేస్తున్న అతుల్య




ఇవి కూడా చదవండి :

ఆ లారీలో 39 మృతదేహాలు చైనావేనా..? మిస్టరీ వీడినట్లేనా?

కర్తార్‌పూర్ అంటే ఏంటి? ఆ యాత్ర ఎలా చెయ్యాలి? కండీషన్లేంటి?

మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ భయపడ్డారా... వ్యూహాత్మకంగా వ్యవహరించారా?

Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...