Imran Khan Says Nuking Pakistan Better : పాకిస్తాన్ లో అవిశ్వాస తీర్మాణం ఎదుర్కొని ఇటీవల ప్రధాని పదవి కోల్పోయిన పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్...మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో దొంగల ప్రభుత్వం నడుస్తోందంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ను దొంగల చేతిలో పెట్టడం కంటే.. అణు బాంబులు వేసి పాకిస్తాను నాశనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. శుక్రవారం తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశంలో రెచ్చిపోతున్న దొంగలను చూసి నేను షాక్ అవుతున్నాను. ఈ దొంగల ప్రభుత్వాన్ని కొనసాగించే బదులు దేశంపై ఓ అణు బాంబు వేయడం ఉత్తమమేమో"అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన కొందరు గతంలో ప్రతీ వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు ఈ క్రిమినల్స్‌పై వాళ్లను ఎవరు విచారిస్తారని ప్రశ్నించారు. ఇతరులపై ఆరోపణలు చేయడం మాని.. ముందు ప్రభుత్వ పని తీరును చక్కబర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు.
ALSO READ Xi Jinping : చైనాలో కీలక పరిణామం..అధ్యక్ష పదవికి జిన్ పింగ్ రాజీనామా!
ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని, కానీ. వాటికి సమాధానం చెప్పలేదని ఇమ్రాన్ తెలిపారు. వాళ్ల నెంబర్లను తాను బ్లాక్ చేశానని చెప్పుకొచ్చారు. ఎన్నికల తేదీలు ప్రకటించే వరకూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని ఇమ్రాన్ ప్రకటించారు. పాక్ నిజమైన స్వాతంత్ర్యం కోసం ఈ నెల 20వ తేదీన 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. మరోవైపు,ప్రజల్లో తన ప్రసంగాల ద్వారా విషం నింపుతున్నారంటూ ప్రధాని షెహబాజ్..ఇమ్రాన్ ఖాన్ పై మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Nuclear, Pakistan