Anger In Pakistan Over Loans ; పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)నుండి పాకిస్తాన్ కి తాజాగా విడతలవారీ రుణాల విడుదల నేపధ్యంలో...పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అంతులేని రుణాల పరంపరపై పాక్ పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నట్లు గురువారం ఓ రిపోర్ట్ తెలిపింది. IMF రుణాల 6వ విడత ఆమోదాన్ని ప్రకటిస్తూ పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. "IMF బోర్డు పాకిస్తాన్ కోసం వారి ప్రోగ్రామ్ యొక్క 6 వ విడతను ఆమోదించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను"అని తారిన్ ట్వీట్ లో పేర్కొన్నాను.
అయితే దేశాన్ని బానిసలుగా మార్చడం ద్వారా ఆర్థిక మంత్రి IMF నుండి కొత్త విడత అందినందుకు సంతోషం వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించడమే కాకుండా విచారకరం అని నివేదిక పేర్కొంది. కొన్ని షరతులకు లోబడి IMF పాకిస్తాన్ కు 6 బిలియన్ అమెరికా డాలర్ల ప్యాకేజీలో భాగంగా...తాజాగా 1 బిలియన్ డాలర్లు విడుదల చేసిన తర్వాత పాకిస్థాన్‌లో ఇంధన ధరలు, పవర్ టారిఫ్ లు చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజల్లో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. IMF యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు జూలై 3, 2019న పాకిస్తాన్ కు 6 బిలియన్ అమెరికా డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ALSO READ పాక్ ప్రధాని రష్యా పర్యటన వెనుక పరమార్ధం..? అగ్గికి ఆజ్యం పోసేందుకే అంటున్న అమెరికా
ఇక, ఆర్థిక దుర్వినియోగం మరియు దేశాన్ని నడపడానికి విదేశీ నిధులపై అధికంగా ఆధారపడటం వల్ల ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం కొత్త కనిష్టానికి పడిపోయిందని పాకిస్తాన్ న్యూస్ పేపర్ 'ఇస్లాం ఖబర్' పేర్కొంది. బహుశా రోజువారీ వ్యవహారాలకు రుణాలు అవసరమయ్యే ఏకైక అణు దేశంగా,దశాబ్దాలుగా సహాయం కోసం యాచించిస్తున్న దేశంగా పాకిస్తాన్ నిలుస్తుందని పాకిస్తాన్‌లోని ఒక మీడియా ఎడిటోరియల్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Imf, Imran khan, Pakistan