మిస్సింగ్ అయిన జపాన్ F-35 ఫైటర్ జెట్... పసిఫిక్ సముద్రంలో కూలిపోయిందా...

Japan News : జపాన్‌కి చెందిన యుద్ధ విమానం మిస్సింగ్ అవ్వడం కలకలం రేపుతోంది. అది సముద్రంలో కూలిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 9:41 AM IST
మిస్సింగ్ అయిన జపాన్ F-35 ఫైటర్ జెట్... పసిఫిక్ సముద్రంలో కూలిపోయిందా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 9:41 AM IST
జపాన్‌కి చెందిన లాక్‌హీడ్ మార్టిన్ F-35 ఫైటర్ జెట్... సడెన్‌గా కనిపించకుండా పోయింది. దాని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అడ్వాన్స్డ్ సింగిల్ సీట్‌తో ఉన్న ఆ ఫైటర్ జెట్.. ఉత్తర జపాన్ వైపు ఉన్న పసిఫిక్ సముద్రంపై వెళ్తూ... జపాన్‌కి 135 కిలోమీటర్ల దూరంలో మిస్సింగ్ అయ్యింది. ఐతే... అది మిస్సింగైన ప్రాంతంలో సముద్రంపై ఏవో శకలాలు కనిపిస్తున్నాయనీ, అవి ఫైటర్ జెట్ వో, కావో తెలుసుకుంటున్నామని జపాన్ అధికారులు తెలిపారు. తమ జెట్స్ జపాన్ వైమానిక దళానికి ఎంతో చక్కగా ఉపయోగపడ్డాయని లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ తెలిపింది. ఆ జెట్ ఏమైపోయిందో తాము పరిశీలిస్తున్నామని అమెరికా రక్షణ విభాగ సంస్థ పెంటగాన్ తెలిపింది.

చైనా ఆర్మీ మరింత శక్తిమంతంగా తయారవ్వడంతో... జపాన్ కూడా తన ఆర్మీని బలోపేతం చెయ్యాలనుకుంటోంది. ఇందుకోసం 87 స్టెల్త్ ఫైటర్లను కొనాలనుకుంటోంది. రెండు దశాబ్దాల నుంచీ ఆర్మీకి సేవలందిస్తున్న F-35 ఫైటర్ జెట్... ఇన్నేళ్లలో రెండుసార్లు మాత్రమే కూలిపోయింది. ఇది ఎంత వేగంగా వెళ్తుందంటే... రాడార్లు కూడా దీన్ని కనిపెట్టలేవు. అందుకే ఇలాంటి మరో 18 అధునాతన F-35లను జపాన్ కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఒక్కో F-35 ఫైటర్ జెట్ విలువ రూ.693 కోట్లుంది. ప్రయాణికుల విమానం కంటే ఇవే రేటెక్కువ. వాటికున్న ప్రత్యేకతల వల్లే జపాన్ వాటిని సమకూర్చుకుంది.

 ఇవి కూడా చదవండి :

ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...

ఓటుకు రూ.500 నుంచీ రూ.5000... ఎక్కడిదీ డబ్బు... మనదే కదా...

ఆ థాయ్‌ల్యాండ్ బీచ్‌లో ఫొటోలు తీసుకుంటే... ఉరి తీస్తారు... ఎందుకో తెలుసా...


రేపు 91 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవీ ప్రత్యేకతలు
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...