రూ.69,49,75,000 విత్‌ డ్రా చేసి... మళ్లీ బ్యాంకులో వేసేశాడు... ఎందుకో తెలుసుకుంటే ఆశ్చర్యమే...

Africa News : నైజీరియా బిలియనీర్ అలికో డాంగొటే మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన చేసిన పని అందర్నీ ఆలోచనలో పడేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 8, 2019, 10:03 AM IST
రూ.69,49,75,000 విత్‌ డ్రా చేసి... మళ్లీ బ్యాంకులో వేసేశాడు... ఎందుకో తెలుసుకుంటే ఆశ్చర్యమే...
నైజీరియా బిలియనీర్ అలికో డాంగొటే (Image : Twitter)
  • Share this:
మీ చేతిలో ఓ రెండు వేల నోటు ఉంటే... అది మీకు ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తుంది. అదే 2వేల నోట్ల కట్ట ఉంటే... ఆ ఆనందం పదింతలవుతుంది. అదే ఓ రూ.20 కోట్ల కరెన్సీ మీ చేతిలో ఉంటే... మీ ఆనందానికి అవధులు ఉండవు... ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం అంటున్నారు ఆఫ్రికాలో అత్యంత సంపన్నుడైన... నైజీరియా బిలియనీర్ అలికో డాంగొటే. తాజాగా ఐవరీ కోస్ట్‌లో జరిగిన ఫోరంలో ఆయన చెప్పిన ఓ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాను ఓసారి బ్యాంకుకి వెళ్లి... $10 మిలియన్ (రూ.69,49,75,000)లను విత్ డ్రా చేసి... కారు డిక్కీలో పెట్టుకొని ఇంటికి పట్టుకెళ్లాడట. ఆ రోజంతా దాన్ని ఇంట్లోని ఓ గదిలో పెట్టుకున్నాడు. దానివైపే చూస్తూ గడిపాడు. తెల్లారే... మళ్లీ ఆ డబ్బును బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ చేసేశాడట. ఎందుకలా చేశారని ఆత్రుతగా కొందరు అడిగారు. దానికి ఆయన చిత్రమైన సమాధానం చెప్పాడు.

aliko dangote,aliko dangote net worth,dangote,aliko dangote 2018,aliko dangote cars,aliko dangote house,aliko dangote biography,aliko dangote interview,aliko dangote documentary,dangote group,aliko dangote age,aliko dangote jet,aliko dangote kids,aliko dangote wiki,aliko dangote wife,aliko dangote facts,aliko dangote yacht,aliko dangote movie,aliko dangote photos,అలికో డాంగొటే,నైజీరియా,సంపన్నుడు,
నోట్ల కట్టలు (File)


మన జీవితం మొదలైన కొత్తలో $10 మిలియన్లు సంపాదించడం చాలా కష్టం. ఒకసారి అంత సంపాదిస్తే... ఆ తర్వాత ఎన్నో మిలియన్లు సంపాదించినా అది పెద్ద విషయం కాదన్నాడు సిమెంట్ మొదలు ఫ్లోర్ వరకూ ఎన్నో మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నడుపుతున్న అలికో.

రోజంతా అలా డబ్బును చూడటం వల్ల... తన దగ్గర నిజంగానే క్యాష్ ఉన్నట్లు అనిపించిందనీ, అది చాలా సంతృప్తిని ఇచ్చిందని అలికో తెలిపాడు. పేపర్లపై లెక్కల్లో కనిపించే డబ్బు కంటే... నిజంగా కనిపించే నోట్ల కట్టలు మనలో కొత్త ఉత్సాహం తెస్తుందన్నాడు.

 

ఇవి కూడా చదవండి :

ఖర్చు తక్కువ... విదేశీ ట్రిప్పులు ఎక్కువ... ప్రధాని మోదీకి ఇదెలా సాధ్యమైంది...

పసుపు కుంకుమ ముసుగులో ఓటర్లకు డబ్బులు... పావులుగా డ్వాక్రా మహిళలు

ఆంధ్రప్రదేశ్‌లో గుట్టలుగా డబ్బుల కట్టలు... ప్రకాశం జిల్లాలో రూ.22 లక్షలు స్వాధీనం...


పెందుర్తి ఎమ్మెల్యే కబ్జాదారుడు... ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్

First published: April 8, 2019, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading