NOW GANJA IS MEDICINAL PLANT IN THAILAND GOVT IS DISTRIBUTING ONE MILLION FREE CANNABIS PLANTS TO HOUSEHOLDS FOR GARDENING SK
Cannabis Farming: గంజాయిని ఎవరైనా సాగు చేయవచ్చు.. అక్కడ ఇంటింటికీ మొక్కల పంపిణీ..
ప్రతీకాత్మక చిత్రం
Thailand Cannabis: కొత్త గంజాయి విధానంలో భాగంగా.. థాయ్‌లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు దాదాపు 10 లక్షల గంజాయి మొక్కలను ఉచితంగా అందజేయనుంది. వీటిని ఇంట్లోనే సాగు చేయవచ్చు. లేదంటే పొలంలో పండించవచ్చు.
మన దేశంలో గంజాయి (Cannabis)సాగు చేయడం నేరం. గంజాయి (Ganja)ని సాగు చేసినా..తరలించినా.. విక్రయించినా.. వినియోగించినా.. పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో వేస్తారు. ఎందుకంటే గంజాయి ఒక మాదక ద్రవ్యం. దాని మత్తులో ఊగుతూ.. ఎంతో మంది యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే మన దేశంలో గంజాయి వాడడం నేరం. కానీ థాయ్‌లాండ్ మాత్రం గంజాయి సాగును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వమే ఇంటింటికీ గంజాయి మొక్కలను పంపినీ చేస్తోంది. ఇక్కడ గంజాయి సాగను థాయ్ లాండ్ ప్రభుత్వ చట్టబద్ధం చేసింది. అందువల్ల ఇక నుంచి అన్ని పంటల్లాగే.. గంజాయిని కూడా సాగుచేయవచ్చు.
గంజాయి (Cannabis Crop Legalization)కి చట్ట బద్ధతకు సంబంధించి స్వయంగా థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ ట్వీట్ చేశారు. ''గంజాయికి చట్టబద్ధత లేదు'' అనే ట్యాగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి గంజాయిని దేశీయ పంటగా మార్చుతున్నట్లు ఆయన వెల్లడించారు. థాయ్‌లాండ్ పర్యాటక రంగం తర్వాత.. ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. మన దేశంలానే అక్కడ కూడా ఎన్నో రకాల పంటలను పండిస్తున్నారు. ఎన్నో రకాల వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి గంజాయిని కూడా వాణిజ్య పంటగా థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటి సాగుతో రైతుల ఆదాయాన్ని పెంచాలని భావిస్తోంది.
2018 నుంచి థాయ్‌లాండ్‌లో గంజాయి సాగు (Cannabis Farming)కు సంబంధించి కొత్త విధానం అమలు చేస్తున్నారు. గంజాయిని ఔషధంగా ఉపయోగించడాన్ని చట్టబద్ధంగా అనుమతించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్ ప్రభుత్వం దీన్ని మాదక ద్రవ్యాల జాబితా నుంచి కూడా తొలగించింది. అనంతరం గంజాయి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా మేలు జరుగుతుందని థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రజలకు భారతీయ కరెన్సీలో 10 బిలియన్ భట్ అంటే.. రూ.2,245 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
కొత్త గంజాయి విధానంలో భాగంగా.. థాయ్‌లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు దాదాపు 10 లక్షల గంజాయి మొక్కలను (Thailand is distributing free cannabis plants) ఉచితంగా అందజేయనుంది. వీటిని ఇంట్లోనే సాగు చేయవచ్చు. లేదంటే పొలంలో పండించవచ్చు. వాటిని విక్రయించి రైతులు ఆదాయం పొందుతారు. గంజాయి ద్వారా 300 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ డబ్బు కోసం గంజాయి మొక్కలను ఇంటింటికీ అందిస్తోంది. కరోనా కారణంగా థాయ్‌లాండ్‌లోని పర్యాటక రంగం కుప్పకూలింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలోనే గంజాయి సాగుకు పచ్చజెండా ఊపింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.