నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాల్సిందే... బ్రిటన్ ప్రభుత్వం స్పందించట్లేదన్న కేంద్రం

Nirav Modi : నీరవ్ మోదీ అప్పగింత కోసం కేంద్రం 2018 ఆగస్టులోనే ప్రతిపాదన పెట్టినా బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 9, 2019, 3:05 PM IST
నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాల్సిందే... బ్రిటన్ ప్రభుత్వం స్పందించట్లేదన్న కేంద్రం
నీరవ్ మోదీ (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: March 9, 2019, 3:05 PM IST
పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.13,000 కోట్లు అప్పు చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి, నేరస్థుడు, బిలియనీర్ నీరవ్ మోదీ లండన్‌లో ఉన్నట్లు స్పష్టమైంది. నీరవ్ మోదీ అక్కడి అత్యంత విలాసవంతమైన రూ.500 కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు తెలిసింది. తాజాగా నీరవ్ మోదీ... లండన్‌లోని ఓ వీధిలో నడిచి వెళ్తూ మీడియాకి చిక్కాడు. అందువల్ల అతను ఎక్కడున్నదీ తెలిసిపోయింది. పైగా అతడు అక్కడ కూడా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టినట్లు స్పష్టమైంది. ఇక అతన్ని భారత్‌కి అప్పగించడమే బ్రిటన్ ప్రభుత్వం ముందున్న పని. ఎందుకంటే... నీరవ్ మోదీని భారత్‌కి అప్పగించాల్సిందిగా... భారత ప్రభుత్వం 2018 ఆగస్టులోనే ఓ ప్రతిపాదన పెట్టింది.

నీరవ్ మోదీ లండన్‌ వీధుల్లో కనిపించడంతో... దానిపై కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఐతే... ఆగస్టులో ప్రతిపాదన పెట్టినా... ఇప్పటికీ అతన్ని అప్పగించకపోవడం విచారకరం అన్నారాయన. ఇప్పటికే రెండు ప్రతిపాదనలు పెట్టామని చెప్పిన రవీష్... బ్రిటన్ ప్రభుత్వం నుంచీ ఎలాంటి స్పందనా రాలేదన్నారు.

ప్రస్తుతం PNB స్కాంలో నీరవ్ మోదీ వాంటెడ్ నేరగాడు. ఇప్పటికే కేంద్రం అతని బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. అలాగే ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించింది. అందువల్ల అతను ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్టు చెయ్యాలి. బ్రిటన్‌లో శరణార్థిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు నీరవ్ మోదీ నో కామెంట్ అంటూ మెల్లిగా జారుకున్నాడు. అందువల్ల అతను లండన్‌లోనే ఉంటాడా ఇంకెక్కడికైనా పారిపోతాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

 

ఇవి కూడా చదవండి :

రూ.13,000 కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ వేసుకున్న జాకెట్ రేటు అక్షరాలా రూ.8,00,000

లండన్‌లో కనిపించిన నీరవ్ మోదీ... బ్రిటన్‌లో మళ్లీ వజ్రాల వ్యాపారం

యూట్యూబ్ అలర్ట్... ఇకపై ఆ వీడియోలకు వార్నింగ్ మెసేజ్

అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...