నేపాల్‌ కొత్త మ్యాప్‌ పై భారత్ కౌంటర్...

భారత భూబాగాలను తమవిగా చూపుతా నేపాల్ తీసుకొచ్చిన కొత్త మ్యాప్ మీద భారత విదేశాంగ శాఖ స్పందించింది.

news18-telugu
Updated: June 13, 2020, 8:14 PM IST
నేపాల్‌ కొత్త మ్యాప్‌ పై భారత్ కౌంటర్...
నేపాల్ కొత్త మ్యాప్‌కు దిగువసభ ఆమోదం (Image;ANI)
  • Share this:
భారత్‌లోని భూభాగాలను తమవిగా చూపుతూ నేపాల్ తీసుకొచ్చిన కొత్త మ్యాప్‌ను ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఈ రాజ్యాంగపరమైన బిల్లును 258 ఓట్లతో  (మొత్తం ఓట్లు 275) పాస్ అయింది. అయితే, ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు. మొత్తం 275 ఓట్లలో ఈ బిల్లు పాస్ కావడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దిగువ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన నేపాలి కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ (నేపాల్), రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే, దీనిపై భారత్ స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘భారత భూబాగాలను నేపాల్‌కు చెందినవిగా చూపుతూ ఆ దేశ పార్లమెంట్‌లో రాజ్యంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు మా దృష్టికి వచ్చింది.  దీనిపై మా వైఖరి గతంలోనే స్పష్టం చేశాం. చారిత్రక వాస్తవాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఈ కృత్రిమమైన మార్పులు చేశారు. అవి ఆమోదయోగ్యం కావు’ అని స్పష్టం చేశారు.

నేపాల్ కొత్త మ్యాప్‌లో ఏడు ప్రావిన్స్‌లు, 77 జిల్లాలు, 753 స్థానిక పరిపాలన డివిజన్లు పొందుపరిచారు. అందులో లింపియాధురా, కాలాపాని, లిపు లేక్ కూడా ఉన్నాయి. లిపు లేక్ పాస్ అనేది కాలాపానిలో ఓ భాగం. 2019 నవంబర్‌లో భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్‌లో దాన్ని భారత భూభాగంగా చూపింది. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలాపాని అనేది ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్ జిల్లాలో భాగమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్ మాత్రం కాలాపాని అనేది ధార్చులా జిల్లాలో భాగం అని పేర్కొంది.
First published: June 13, 2020, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading