• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • NOT SEVEN THERE ARE EIGHT CONTINENTS ON PLANET EARTH FOUND THE NEW CONTINENT KNOW THE FULL DETAILS BA GH

భూమిపై ఏడు కాదు... ఎనిమిది ఖండాలు.. కొత్తది ఎక్కడుంది?.. దీని పేరేంటి? ఎలా కనిపెట్టారో చూడండి

భూమిపై ఏడు కాదు... ఎనిమిది ఖండాలు.. కొత్తది ఎక్కడుంది?.. దీని పేరేంటి? ఎలా కనిపెట్టారో చూడండి

ప్రతీకాత్మక చిత్రం

భూమి పరిణామం, ఖండాల ఏర్పాటు, వాతావారణం.. వంటి అంశాలపై కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. ఖండాలను గుర్తించిన తరువాత.. దక్షిణార్థ గోళంలో ఒక పెద్ద భూభాగం ఉందని చాలామంది పరిశోధకులు భావించేవారు. డచ్ అన్వేషకుడు అబెల్ తస్మాన్ కూడా ఇదే విషయాన్ని నమ్మారు.

  • Share this:
భూమి పరిణామం, ఖండాల ఏర్పాటు, వాతావారణం.. వంటి అంశాలపై కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు. ఖండాలను గుర్తించిన తరువాత.. దక్షిణార్థ గోళంలో ఒక పెద్ద భూభాగం ఉందని చాలామంది పరిశోధకులు భావించేవారు. డచ్ అన్వేషకుడు అబెల్ తస్మాన్ కూడా ఇదే విషయాన్ని నమ్మారు. ఆ పెద్ద భూభాగాన్ని గుర్తించాలని 1642లో ఆయన అన్వేషణ ప్రారంభించారు. మొత్తానికి ఒక ప్రాంతాన్ని అతడు కనుగొన్నాడు. కానీ దాని పరిధిని గుర్తించలేకపోయాడు. ఆ భూభాగం 94 శాతం నీటితో నిండిపోయిందని ఆ తరువాత చేసిన పరిశోధనల్లో తేలింది. తాజాగా సుమారు మూడున్నర శతాబ్ధాల తరువాత ఆయన వాదన నిజమని నిరూపితమైంది. 1995లో అమెరికన్ జియో ఫిజిస్ట్ బ్రూస్ లుయండిక్ ఇదే ప్రాంతంపై పరిశోధనలు చేశాడు. న్యూజిలాండ్ చుట్టూ ఉన్న ఆ పెద్ద భూభాగాన్ని అతడు ఒక ఖండంగా గుర్తించాడు. దానికి జీలాండియా అని పేరు పెట్టాడు. డచ్ పరిశోధకుడు అబెల్ వెల్లడించిన అభిప్రాయాన్ని 375 సంవత్సరాల తరువాత పరిశోధకులు ధ్రువీకరించారు. నీటిలో మునిగిపోయిన ఈ భూభాగాన్ని శాటిలైట్ల సాయంతో గుర్తించారు.

అమెరికా పరిశోధనలు
బ్రూస్ జీలాండియాను గుర్తించిన తరువాత జియోలాజికల్ సర్వే ఆఫ్ అమెరికా (GSA) శాటిలైట్ కెమెరాల ద్వారా ఈ భూభాగంపై పరిశోధనలు చేసింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పెద్ద భూభాగం ఉండేదని సంస్థ పరిశోధకులు కనుగొన్నారు. అది విస్తీర్ణంలో ఆస్ట్రేలియా అంత పెద్దగా ఉంటుందని గుర్తించారు. జీలాండియా అనేది నీటిలో దాగి ఉన్న ఖండమని GSA పేర్కొంది. భూమిపై తక్కువ వయసున్న, ఏడో అతిపెద్ద ఖండం ఇదేనని ఆ సంస్థ తెలిపింది. ఈ భూభాగమంతా సముద్రంలో మునిగిపోవడం వల్ల దీన్ని మునిగిపోయిన ఖండం లేదా సబ్ మెర్డ్‌డ్ కాంటినెంట్ అంటున్నారు.

GSA వాదన నిజమేనా?
GSA పరిశోధన నేపథ్యంలో అసలు ఖండం అని ఎలాంటి భూభాగాన్ని నిర్వచిస్తారనే అంశంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. మునిగిపోయిన ప్రాంతాన్ని ఖండంగా ఎలా గుర్తిస్తారని GSAను కొంతమంది నిపుణులు ప్రశ్నించారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే విస్తృతమైన భూభాగం.. వివిధ రకాల శిలలతో నిండిన ప్రాంతం.. సముద్ర తీర ప్రాంతాలకంటే మందమైన భూ పొరలు, భూకంపాల తీవ్రత తక్కువగా ఉండే ప్రాంతం... స్పష్టమైన హద్దులు ఉండే భూభాగం.. ఇవన్నీ ఖండాల లక్షణాలు. సాధారణంగా మనం పెద్ద భూభాగాన్నే ఖండం అంటాం. కానీ ఎంత పెద్ద భూభాగం అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఈ లెక్కన చూస్తే.. భూమిపై మొత్తం ఆరు ఖండాలు ఉన్నాయి. అవి.. యూరేషియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. కానీ జీలాండియా మరో ఖండమని తాజాగా GSA ధ్రువీకరించింది.

పరిశోధనలు అవసరం
కేవలం ఖండాల జాబితాకు జీలాండియాను జత చేయడం వల్ల పరిశోధన ముగియదని GSA అధ్యయనం తెలిపింది. ఒక ఖండంగా వర్గీకరించే జీలాండియా శాస్త్రీయ విలువ మనం ఊహించన దాని కంటే చాలా ఎక్కువని సంస్థ పేర్కొంది. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూభాగాలు విడిపోయి ప్రస్తుత ఖండాలుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో జీలాండియా నీటిలో మునిగిపోయింది. కానీ ఇది విచ్ఛిన్నం కాలేదు. అందువల్ల దీనిపై చేసే పరిశోధనలు కాంటినెంటల్ క్రస్ట్‌ విచ్ఛిన్నం గురించి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుందని GSA వివరించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు