Home /News /international /

NOT ONLY PATELS 3 OTHER FAMILIES WHO ATTEMPTED TO ENTER US FOUND MISSING REPORT GH VB

US-Canada border: పటేల్ ఫ్యామిలీ మాత్రమే కాదు..అమెరికాలోకి ప్రవేశిస్తూ మిస్సయిన మరో 3 ఫ్యామిలీలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా-కెనడా సరిహద్దు (US-Canada border)లో మైనస్ డిగ్రీల వాతావరణంలో చిక్కుకుపోయిన ఓ పటేల్ కుటుంబం (Patel family) దారుణ విషాదాంతానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర ఘటనతో భారతదేశమంతటా విషాదఛాయలు అలుముకున్నాయి.

అమెరికా-కెనడా సరిహద్దు (US-Canada border)లో మైనస్ డిగ్రీల వాతావరణంలో చిక్కుకుపోయిన ఓ పటేల్ కుటుంబం (Patel family) దారుణ విషాదాంతానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర ఘటనతో భారతదేశమంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారక ఘటనపై జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు, గుజరాత్‌ (Gujarat)లో ప్రబలంగా ఉన్న మానవ అక్రమ రవాణా రాకెట్‌ (human trafficking rockets)లకు సంబంధాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది. గుజరాత్‌లోని మానవ అక్రమ రవాణా ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాక ప్రజలను యూఎస్ లేదా కెనడాకు పంపుతామని హామీ ఇస్తారని విచారణలో తేలింది. అయితే వీరి వలలో చిక్కి ఒక్క పటేల్ కుటుంబం మాత్రమే కాదు అమెరికా సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన మరో మూడు ఫ్యామిలీలు కూడా మిస్ అయినట్లు ఓ నివేదిక పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం అందర్నీ విస్తుగొల్పుతోంది.

Budget 2022: త్వరలో కేంద్ర బడ్జెట్.. రూ.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్..?ఆ మినహాయింపులు కూడా ఉంటాయా..?


-35 డిగ్రీల అతిశీతల పరిస్థితుల్లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు పటేల్ కుటుంబ సభ్యుల గడ్డకట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వీరంతా గుజరాత్‌కు చెందిన వారు కాగా.. వీరి మృతదేహాలను జనవరి 19న అక్కడి అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు గోపి, ధార్మిక్‌లు మంచు తుఫాను ధాటికి ప్రాణాలు విడిచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన తర్వాత యూఎస్, కెనడాకు కుటుంబాలను పంపే స్థానిక ఏజెంట్లపై విచారణ మొదలయ్యింది. అయితే ఈ విచారణలో స్థానిక ఏజెంట్లు గత మూడేళ్లలో 10 కుటుంబాలను అమెరికాకు అక్రమంగా తరలించినట్లు వెల్లడించింది. ఈ 10 కుటుంబాల్లో మూడు కుటుంబాలు అదృశ్యమైనట్లు ఓ నివేదిక పేర్కొంది.

కెనడా సరిహద్దులో మరణించిన పటేల్ కుటుంబ సభ్యులు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని కలోల్ తాలూకాలోని దింగుచా (Dingucha) గ్రామానికి చెందినవారు. స్థానిక ఏజెంట్లు కెనడాకు పంపిన భారతీయుల గుంపులో ఈ నలుగురు కూడా ఉన్నారు. వీరిని కెనడా నుంచి యూఎస్‌కు అక్రమంగా రవాణా చేసేందుకు స్థానిక ఏజెంట్లు ప్లాన్ చేశారు. ఘటన తరువాత ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ పోలీసులు ఓ స్థానిక ఏజెంట్‌ను పట్టుకున్నారు. జనవరి మొదటి వారంలో జగదీష్ పటేల్ కుటుంబ సభ్యులను కెనడాకు పంపినట్లు ఆ ఏజెంట్ పోలీసులకు తెలిపాడు. ట్రావెల్ ఏజెంట్ కార్యనిర్వహణ విధానాన్ని కూడా పోలీసులు బహిర్గతం చేశారు.

సదరు ఏజెంట్ మొదట్లో థాయిలాండ్ వంటి చిన్న దేశాలకు టూరిస్ట్ వీసాలపై ప్రజలను పంపించి వారిని నిజమైన ప్రయాణీకులని అందరినీ నమ్మించేలా ఒక ప్లాన్ రచించినట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. తర్వాత సదరు ఏజెంట్ వారిని కెనడాకు పంపాడని.. ఆపై యూఎస్ లోకి చొరబాటుకు ప్రయత్నించాడని పోలీసులు వివరించారు. అయితే, గుజరాతీ కుటుంబ సభ్యులు అమెరికాలోకి ప్రవేశించేందుకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలోని నివసించే చాలామంది మెరుగైన జీవనం కోసం అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వీరు రిస్కులు విస్మరించి చెల్లుబాటు అయ్యే వీసాలు లేకుండా యూఎస్‌కి వెళ్లడానికి ప్రయత్నిస్తారని పోలీసులు పేర్కొన్నారు.

Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఐటీ కంపెనీల డిమాండ్లు ఇవే...


పటేల్ కుటుంబ సభ్యుల మృతదేహాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (RCMP) పెట్రోలింగ్ సమయంలో కెనడాలోని ఎమర్సన్, మానిటోబాలో యూఎస్-కెనడా సరిహద్దు నుంచి మీటర్ల దూరంలో కనుగొన్నారు. చలికాలంలో యూఎస్, కెనడాలోని చాలా ప్రాంతాలలో విపరీతమైన చలి ఉంటుంది. ఈ చలే ఈ నలుగురిని బలిగొంది. అయితే మానిటోబా సమీపంలోని సరిహద్దు ద్వారా కెనడా నుంచి యూఎస్‌కు గుజరాతీలతో సహా ఇతర పత్రాలు లేని వలసదారులను ఫ్లోరిడా నివాసి అయిన స్టీవ్ శాండ్‌ అక్రమంగా రవాణా చేస్తుండగా.. పోలీసులు ఇతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: International, International news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు