• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • NORWAY PRIME MINISTER ERNA SOLBERG FINED FOR BREAKING CORONA RULES AT HER BIRTHDAY PARTY IN FEBRUARY NK

Covid 19 rules: రూల్ బ్రేక్ చేసిన ప్రధాని.. భారీగా ఫైన్ విధింపు.. ఎంత వేశారంటే...

Covid 19 rules: రూల్ బ్రేక్ చేసిన ప్రధాని.. భారీగా ఫైన్ విధింపు.. ఎంత వేశారంటే...

Covid 19 rules: రూల్ బ్రేక్ చేసిన ప్రధాని.. భారీగా ఫైన్ విధింపు (image credit - NIAID)

Covid 19 rules: రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్... అనేది సక్రమంగా అమలైతే... అందరికీ మంచే జరుగుతుంది. ఈ క్రమంలో తప్పు చేసిన ప్రధానికి కూడా ఫైన్ వెయ్యడం సంచలనం, ఆహ్వానించదగ్గ విషయం.

  • Share this:
    Covid 19 rules: మన దేశంలో రూల్స్ ఎంత గొప్పగా అమలవుతాయో మనందరికీ తెలుసు. కానీ నార్వే, ఫిన్‌లాండ్ లాంటి ఉత్తరార్ధ గోళ దేశాల్లో రూల్స్ వంద శాతం అమలవుతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. కరోనా రూల్స్ అతిక్రమించి బర్త్ డే పార్టీ చేసిన నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్ (Erna Solberg)కి తాము ఫైన్ వేశామని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ బర్త్‌డే పార్టీకి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వాళ్లు సోషల్ డిస్టాన్స్ పాటించలేదు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. సీసీటీవీ ఫుటే‌జ్‌లో ఆధారాలు లభించాయి. అంతే 20,000 నార్వే క్రౌన్ల జరిమానా వేశారు. రూపాయిల్లో చెప్పాలంటే రూ.1,75,922. మన దేశంలో ఇలాంటివి ఊహించడం కూడా జరగదు కదా.

    రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసిన ఎర్నా... ఫిబ్రవరిలో తాను జరుపుకున్న పుట్టిన రోజు వేడుకలపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. తన 60వ బర్త్ డే వేడుకలకు ఆమెను 13 మంది కుటుంబ సభ్యులను పిలిచారు. మౌంటేన్ రిసార్టులో ఈ వేడుక జరిగింది. ఐతే... ప్రభుత్వ రూల్ ప్రకారం... 10 మందికి మించి ప్రజలు గుమికూడరాదు.

    జనరల్‌గా నార్వే పోలీసులు ప్రతీదీ పట్టించుకోరు. ఇదే పనిని సామాన్య ప్రజలు చేసి ఉంటే... లైట్ తీసుకునేవాళ్లే. కానీ స్వయంగా ప్రధానే తప్పు చేయడంతో... దేశ ప్రజలు కూడా అలా చేస్తే సమస్య వస్తుందని భావించి... ఆమెకు ఫైన్ వేశారు. "స్వయంగా ప్రధానిగా ఫైన్ వేసినప్పుడు సామాన్యులం మాకు వెయ్యకుండా ఉంటారా" అని ప్రజలు భయపడే పరిస్థితి ఉంటుంది. తద్వారా కరోనా జాగ్రత్తలు పాటిస్తారన్నది పోలీసుల యాంగిల్.

    erna solberg
    ఎర్నా సోల్‌బెర్గ్


    ఈ కేసులో ప్రధాని భర్త సిండ్రే ఫిన్నెస్ కూడా ఉన్నారు. ఈ పార్టీ చేసుకుందాం అని ఆయన కూడా అన్నారు. అందువల్ల ఈ నేరం వెనక ఆయనకూ భాగం ఉన్నట్లే అన్న పోలీసులు... ఆయనకు మాత్రం ఫైన్ వెయ్యలేదని చెప్పారు. ఇక ఈ వేడుకలకు ఏర్పాటు చేసిన రెస్టారెంట్... 10 మంది కంటే ఎక్కువ మందిని పార్టీకి అనుమతించకూడదు. కానీ పార్టీ ప్రధానిది కావడంతో.. అనుమతించారు. ఇది నేరమే అయినప్పటికీ... నార్వే పోలీసులు ఆ రెస్టారంట్‌కి ఫైన్ వెయ్యలేదని తెలిపారు.

    ఇది కూడా చదవండి: Corona vaccine: వ్యాక్సిన్ విషయంలో తేడా... ముగ్గురు మహిళలకు అనారోగ్య సమస్యలు

    ఈ ఫైన్‌పై ప్రధాని ఇంకా స్పందించలేదు. ఐతే... ఎర్నా సోల్బెర్గ్... నార్వేలో గతేడాది కరోనా రూల్స్ చాలా కఠినంగా అమలుచేయడం వల్ల యూరప్ లో తక్కువ కరోనా కేసులున్న దేశాల్లో ఒకటిగా నార్వే నిలిచింది. మరణాలు కూడా తక్కువగానే వచ్చాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో నార్వేలో సెకండ్ వేవ్ దూసుకొచ్చింది. కేసులు బాగా పెరిగాయి. దాంతో... కరోనా రూల్స్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నార్వేలో నిన్న 1218 పాజిటివ్ కేసులు రాగా... మొత్తం కేసులు 1,02,719కి చేరాయి. నిన్న ఎవరూ చనిపోలేదు. మొత్తం మరణాలు 684 ఉన్నాయి. నార్వే మొత్తం జనాభా 54,53,925 మాత్రమే. హైదరాబాద్‌లో సగం అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: