Kim Jong:కోమాలో ఉన్న కిమ్.. మరోసారి ఆరోగ్యంపై ఊహాగానాలు

కిమ్ జాంగ్ ఉన్(ఫైల్ ఫోటో)

Kim Jong in Coma: కొంతకాలంగా కిమ్ చాలా తక్కువ సార్లు బయట కనిపించడంతో ఆయన చనిపోయారనే ప్రచారం కూడా సాగింది

  • Share this:
    Kim Jong News: ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కిమ్ ఆరోగ్యం దెబ్బతిన్నదని.. అసలు ఆయనకు ఏమైందో తెలియదనే ప్రచారం జరిగింది. అయితే ఆ ఆ తరువాత మళ్లీ కిమ్ బయటకు వచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కిమ్ ఆరోగ్యం గురించి ఆ దేశానికి చెందిన అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో అధికారిగా పని చేసిన చాంగ్ సాంగ్ మిన్.. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ గూఢచర్య వర్గాలు తెలిపాయని వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలను కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ చూస్తున్నారని పేర్కొన్నారు.

    కొంతకాలంగా కిమ్ చాలా తక్కువ సార్లు బయట కనిపించడంతో ఆయన చనిపోయారనే ప్రచారం కూడా సాగింది. ఆ సమయంలో ఉత్తర కొరియో చీఫ్ బాధ్యతలు ఇక కిమ్ సోదరి కిమ్ యో జాంగ్‌వే అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కిమ్ గురించి ఈ తరహా వార్తలు రావడం.. ఆ తరువాత అతడు బయటకు వచ్చి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగిపోయింది. మరి.. ఈసారి తన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలపై కిమ్ ఏ రకంగా సమాధానం చెబుతారో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: