Home /News /international /

NORTH KOREAN HACKERS STOLE MORE THEN 300 MILLION FOR NUCLEAR WEAPONS REPORT REVEALS MS GH

North Korea: 300 మిలియన్ డాలర్లు దొంగిలించిన ఉత్తరకొరియా హ్యాకర్లు : ఐరాస నివేదిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2019-2020 నవంబరు మధ్య కాలంలో విలువైన వర్చువల్ ఆస్తులను హ్యాకర్లు దొంగిలించారని ఐక్యరాజ్యసమితిలో ఓ సభ్యదేశం పేర్కొంది. విదేశాల నుంచి కార్యక్రమాలకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడం కొనసాగిస్తూనే ఉత్తర కొరియా ఈ దారుణాలకు ఒడిగట్టుతున్నదని ఆరోపించింది.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
వీలు చిక్కినప్పుడల్లా ఉత్తర కొరియా హ్యాకర్లు డబ్బు తస్కరిస్తూనే ఉన్నారు. గతంలో పలుమార్లు ఈ విధంగా మిలియన్ల డాలర్లు దొంగిలించిన అంశం వార్తల్లో నిలిచాయి. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఉత్తర కొరియా హ్యాకర్ల దళం 2020లో వందల మిలియన్ల డాలర్లను తస్కరించిందని ఐక్యరాజ్యసమితి రహస్య నివేదిక తెలిపింది. అసలే ఆర్థిక సంక్షోభంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న కిమ్ జోంగ్ ఉన్ సర్కారు ఆయుధాల కోసం ఆర్థిక సంస్థలు, వర్చువల్ ఎక్స్ ఛేంజ్ హౌస్ లకు వ్యతిరేక కార్యకలపాలు నిర్వహించినట్లు ఈ నివేదికలో ఆరోపించింది.

2019-2020 నవంబరు మధ్య కాలంలో విలువైన వర్చువల్ ఆస్తులను హ్యాకర్లు దొంగిలించారని ఐక్యరాజ్యసమితిలో ఓ సభ్యదేశం పేర్కొంది. విదేశాల నుంచి కార్యక్రమాలకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడం కొనసాగిస్తూనే ఉత్తర కొరియా ఫిస్సైల్ మెటిరియాల్స్ ను ఉత్పత్తి చేసిందని, అణు కార్యక్రమాలను నిర్వహించి బాలిస్టిపిక్ క్షిపణి మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేసిందని నివేదిక ఆరోపించింది.

ఉత్తర కొరియా చాలా ఏళ్లుగా శక్తివంతమైన అణ్వాయుధాలను, వాటితోపాటు అధునాతన క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిందని స్పష్టం చేసింది.
ఉత్తర కొరియా అణ్వాయుధాన్ని బాలిస్టిక్ క్షిపణితో ప్రయోగించే సిరీస్ ను అభివృద్ధి చేసినట్లు యూఎన్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే ఆ మిస్సైల్స్ భూ వాతావరణంలో విజయవంతమైందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఫలితంగా కిమ్ పాలనపై విధించిన ఆంక్షల అమలు, వారి సామర్థ్యాన్ని పర్యవేక్షించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం నివేదికలో తేలింది. ప్రస్తుతం గోప్యంగా ఉన్న ఈ నివేదిక నుంచి వివరాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విశ్వసనీయ వర్గాల ద్వారా బహిర్గతమయ్యాయి.

ప్యానెల్ నివేదికలో ఐరాస సభ్యదేశాలు, ఇంటిలిజెన్స్ ఏజేన్సీలు, మీడియా, శరణార్థులు, ఇతర దేశాలకు చెందిన సమాచారం ఉంటుంది. ఉత్తరకొరియా నుంచి కాదు ఈ నివేదికలు సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఓ సారి విడుదలవుతాయి. ఏడాది ప్రారంభంలో ఓ సారి, మరోకటి ఆరు నెలల తర్వాత విడుదల చేస్తారు. తాజాగా బహిర్గతమైన యూఎన్ రిపోర్డ్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై స్పష్టత లేదు. గతంలో లీక్ అయిన నివేదికలను ఐరాస భద్రతా మండిల సభ్య దేశాలైన రష్యా, చైనా రెచ్చగొట్టాయి. ఫలితంగా దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, జాప్యాలకు దారితీసింది.

గత నెలలో జరిగిన ఓ ముఖ్యమైన రాజకీయ సమావేశంలో అణు, క్షిపణి కార్యక్రమాల కోసం అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఉత్తరకొరియా కృషి చేస్తుందని సమాచారం. వ్యూహాత్మక అణ్వాయుధాలు, ఆధునిక వార్ హెడ్ వంటివి ఉన్నప్పటికీ అమెరికాను అరికట్టడానికి క్షిపణి రక్షణ వ్యవస్థలను రూపొందించుకుంది. ఇప్పటికీ పలుమార్లు ఇరు దేశాల అధినేతలు సమావేశమైనప్పటికీ అణ్వాయుధాల విషయంలో రాజీకి రాలేకపోయాయి.

2018లో మొదటిసారి మాజీ అధ్యక్షుడు ట్రంప్, కిమ్ తో భేటి అయినప్పుడే ఈ విషయంపై విఫలయత్నం చేశారు. అనంతరం మరో రెండు సార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. మిత్రదేశాలైనా దక్షిణకొరియా, జపాన్ తో కలిసి అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎలా ముందుకెళ్తారో స్పష్టత లేదు. బైడెన్ జాతీయ సలహాదారు జేక్ సల్లివాన్ గత వారం మాట్లాడుతూ పరిపాల విధాన సమీక్ష నిర్వహిస్తామని అన్నారు.

నూతన ఆదాయ వనరు..

కోవిడ్-19 ప్రభావంతో సరిహద్దు నియంత్రణలు కఠినతరం చేసిన ఉత్తరకొరియా విదేశాల నుంచి అవసరమైన కరెన్సీని తీసుకొచ్చే పాలన సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయని యూఎన్ ప్యానెల్ తేల్చింది. పాంగ్యాంగ్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కఠినమైన యూఎన్ ఆంక్షల ఏగవేత పథకాలను ఉపయోగిస్తుంది. ఉత్తరకొరియా ఎగుమతుల్లో చారిత్రాత్మక ఎగుమతుల్లో ఒకటి. 2019 ప్యానెల్ నివేదిక ప్రకారం దీనిపై పాంగ్యాంగ్ 370 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2,100 కోట్లు) వసూలు చేసిందిని కనుగొన్నారు. అయితే జులై 2020 నుంచి ఎగుమతులు నిలిపివేచినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు నివారించడానికి 2020లో ఉత్తరకొరియా బయటి ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంది. బీజింగ్ తో సహా దాదాపు అన్ని దేశాల్లో వాణిజ్యాన్ని నిలిపివేయడంతో తన ప్రజలను ఆకలితో ఉంచింది.

ఇరాన్ తో సహవాసం..

ఆయుధాల అభివృద్ధి చేయడానికి అవసరమైన కీలక భాగాలను వర్తక చేయడంతో పాటు సుదూర క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులపై ఉత్తరకొరియా, ఇరాన్ సహాకారాన్ని పునరుద్ఘాటించాయని పలు ఐరాస దేశాలు పేర్కొన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఉత్తర కొరియా 2017లో మూడు ఖండాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను(ఐసీబీఎం) విజయవంతంగా పరీక్షించింది. అక్టోబరులో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఈ క్షిపణుల పేరెడ్ నిర్వహించింది. యూఎస్ఏ దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాల్లో ఒకటి. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ అరబ్ దేశాలు ఇరాన్ బాలిస్టిక్ ఆయుధాలను అరికట్టాలని పిలుపునిచ్చాయి. అయితే ఇరాన్ నాయకులు పదే పదే చర్చలకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంపై ఉత్తరకొరియాతో కలిసి పనిచేస్తున్నట్లు వచ్చే వార్తలను టెహ్రాన్ సర్కారు ఖండించింది. ఈ నివేదికలో ఇరాన్ యూఎస్ మిషన్ డిసెంబరులో యూఎన్ నిపుణుల ప్యానెల్ తప్పుడు సమాచారం, కల్పిత డేటా ప్యానెల్ పరిశోధనలు విశ్లేషణలో ఉపయోగించబడి ఉండవచ్చు అని నివేదిక పేర్కొంది.
Published by:Srinivas Munigala
First published:

Tags: Hacking, North Korea, United Nations

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు