Home /News /international /

NORTH KOREAN GARDENERS SENT TO LABOUR CAMP FOR FAILING TO MAKE KIM FLOWERS BLOOM PVN

North Korea : పూలు పూయించలేదని..తోటమాలీలను జైళ్లో పెట్టిన కిమ్

jకిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

jకిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

North Korean gardeners :  ఉత్తరకొరియా(North Korea)లో చీమ చిటుక్కుమన్నా అది ప్రపంచానికి పెద్ద వార్తే అవుతుంది. ఎందుకంటే ఆ దేశాన్ని పాలిస్తున్నది కిమ్ జాంగ్ ఉన్. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్(Kim jong un) ఏ డెసిషన్ తీసుకున్నా అది సంచలనంగానే మారుతుంది.

ఇంకా చదవండి ...
North Korean gardeners :  ఉత్తరకొరియా(North Korea)లో చీమ చిటుక్కుమన్నా అది ప్రపంచానికి పెద్ద వార్తే అవుతుంది. ఎందుకంటే ఆ దేశాన్ని పాలిస్తున్నది కిమ్ జాంగ్ ఉన్.  కిమ్ జాంగ్ ఉన్(Kim jong un) ఏ డెసిషన్ తీసుకున్నా అది సంచలనంగానే మారుతుంది. మనిషి ఎంత పొట్టిగా ఉంటాడో...అంతకంటే ఎక్కువగా తన నిర్ణయాలతో దేశాన్ని గడగడలాడిస్తుంటాడు. తన మాటవినని వారిని, చిన్న చిన్న పొరబాటులకే ప్రజలను శిక్షిస్తూ..వార్తల్లో నిలుస్తుంటాడు కిమ్. అటువంటి మరో సంఘటనతో తాజాగా వార్తల్లో నిలిచాడు కిమ్ జోంగ్ ఉన్. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం సందర్భంగా అలంకరణ కోసం ఉపయోగించే పువ్వులు పూయించలేదంటూ ఇద్దరు తోటమాలీలను(North Korea Gardeners)అరెస్ట్ చేసి లేబర్ క్యాంప్(జైలు)కి తరలించాడు కిమ్. ఇద్దరు తోటమాలీలకు ఆరు నెలల జైలు శిక్ష విధించాడు.

ఉత్తర కొరియా ఫిబ్రవరి 16న కిమ్ జోంగ్ ఇల్ పుట్టినరోజును జరుపుకుంటుంది. దీనిని షైనింగ్ స్టార్ డే అని కూడా పిలుస్తారు. ఇది దేశం యొక్క అతిపెద్ద సెలవుదినం కూడా. సాంప్రదాయకంగా, 2011లో 69 ఏళ్ల వయసులో మరణించిన కిమ్ జోంగ్ ఇల్ పుట్టినరోజుకు ముందు ఉత్తర కొరియా నగరాల వీధులు ఎర్రటి పూలతో కప్పబడి ఉంటాయి. కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం సందర్భంగా.. ఆయన సమాధి ప్రాంతంలో..రహదారి పొడువునా.. ఎర్రటి పుష్పాలు పూచేలా ప్రతి ఏడాది మొక్కలను ఏర్పాటు చేస్తారు. కింజోంగిలియాగా పిలిచే ఈ పుష్పాలు సమశీతోష్ణస్థితి వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి. ఉత్తరకొరియా, చైనాలో విరివిగా పూచే ఈ పూలు దక్షిణాసియాలో కనిపించే మందారం జాతికి చెందినవిగా పేర్కొంటారు.

ALSO READ Potato Milk : గేదె పాలు,ఆవు పాలు కాదు..మార్కెట్ లోకి 'ఆలూ మిల్స్'..ఎగబడుతున్న జనం

అయితే ఇటీవల ఉత్తర కొరియాలో విపరీతమైన మంచు కురిసింది. దీంతో మొక్కలను పెంచేందుకు సరైన వాతావరణం లేక తోటమాలీలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈపుష్పాలు పూచేలా గ్రీన్ హౌస్ బాయిలర్లను ఉపయోగిస్తారు. అయితే మంచు కారణంగా వంటచెరకు లభించక.. ఈ ఏడాది బాయిలర్లు పనిచేయలేదు. దీంతో బాయిలర్ ను నిర్వహిస్తున్న యజమానికి మూడు నెలలు.. తోటమాలికి ఆరు నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించాడు కిమ్. ఉత్తర రియాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని సంసు కౌంటీలో కిమ్‌జోంగిలియా పువ్వును పెంచుతున్న వ్యవసాయ క్షేత్ర నిర్వాహకుడిని, బాయిలర్ ను నిర్వహిస్తున్న 40 ఏళ్ల యజమానిని బుధవారం అరెస్టు చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Flower crops, Jails, Kim jong un, North Korea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు