• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • NORTH KOREAN FISHING CAPTAIN EXECUTED IN FRONT OF 100 FISHERMEN FOR LISTENING TO FOREIGN RADIO AT SEA MS GH

వేరే దేశపు పాటలు వింటున్నాడని ఓ వ్యక్తికి బహిరంగంగా ఉరి.. ఉత్తరకొరియాలో మరో దారుణం..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (ఫైల్ ఫోటో)

ఉత్తర కొరియాలో ప్రజలపై, మీడియాపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ప్రభుత్వ టీవీ ఛానళ్లు, రేడియో, న్యూస్ పేపర్లకు మాత్రమే అక్కడ అనుమతి ఉంది. వేరే దేశాలకు చెందిన వార్తలు వినేందుకు అనుమతి లేదు.

  • News18
  • Last Updated :
  • Share this:
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నియంతృత్వ పోకడల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉండే కిమ్.. తాజాగా ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరితీయించాడు. ఇందుకు పెద్ద కారణం కూడా లేదు. చేపలు పట్టుకునే చోయ్(Choi) అనే ఒక ఫిషింగ్ బోట్ కెప్టెన్‌ విదేశీ రేడియో వింటున్నాడనే చిన్న కారణంతో అందరి ముందు ఉరితీయించాడు. 40ఏళ్ల బాధితుడు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడని పోలీసులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కొరియాలో ప్రజలపై, మీడియాపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ప్రభుత్వ టీవీ ఛానళ్లు, రేడియో, న్యూస్ పేపర్లకు మాత్రమే అక్కడ అనుమతి ఉంది. వేరే దేశాలకు చెందిన వార్తలు వినేందుకు అనుమతి లేదు. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే విచారణ లేకుండానే కాల్చి చంపిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగుచూశాయి.

విదేశీ రేడియో వింటున్నాడని..
తాజాగా ఉరికి బలైన చోయ్‌ రేడియో ఫ్రీ ఏషియా (Radio Free Asia) అనే విదేశీ రేడియో ప్రసారాలను వింటున్నాడని అక్కడి అధికారులు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు అక్రమంగా వార్తలు, ఇతర కార్యక్రమాలు వింటున్నాడనే కారణంతో ఈ అక్టోబర్‌లో చాంగ్జిన్ (Chongjin) ప్రాంతానికి చెందిన ఫిషింగ్ బోట్ కెప్టెన్‌ను ఫైరింగ్ స్క్వాడ్ పోలీసులు ఉరితీశారని విదేశీ నిఘా వర్గాలు వెల్లడించాయి. బాధితుడికి 50 వరకు నౌకలు ఉన్నట్లు సమాచారం. విదేశీ రేడియో ప్రసారాలను అక్రమంగా వింటున్నాడని అతడి వద్ద పనిచేసే వారిలో ఒకరు పోలీసుకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి.. Shockers Of 2020: ఈ ఏడాది కరోనాని మించి ప్రపంచాన్ని కదిలించిన ఘటనలు.. వాటిమీద ఓ లుక్కేయండి

మిలటరీలో పనిచేసిన బాధితుడు
చోయ్ ఉత్తర కొరియా మిలటరీలో రేడియో ఆపరేటర్‌గా పనిచేశాడు. అప్పటి నుంచే అతడికి ఇతర దేశాల రేడియో ప్రసారాలను వినడం అలవాటైందని స్థానిక అధికారులు చెబుతున్నారు. మిలటరీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ అలవాటును కొనసాగించాడు. దీంతో నేరం చేసినందుకు అతడిని ఉరి తీయాలని నిర్ణయించారు. రేడియో ఫ్రీ ఏషియా సంస్థకు వాష్టింగ్టన్ నుంచి నిధులు అందుతున్నాయి. ఆ సంస్థ కార్యాలయం ఒకటి దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉంది. ఉత్తర కొరియాలో రోజుకు ఆరు గంటల వరకు ప్రోగ్రామింగ్‌ చేసుకునేందుకు ఆ సంస్థకు అనుమతులు కూడా ఉన్నాయి. ఆ దేశంలో విదేశీ రేడియో ప్రసారాలపై పూర్తి స్థాయిలో నిషేధం లేదు. కానీ ప్రజలకే ఏయే వార్తలు చేరవేయాలనేది నిర్ణయించేది మాత్రం ప్రభుత్వమే.
Published by:Srinivas Munigala
First published: