• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • NORTH KOREA SUPREME LEADER KIM JONG UN IS ON TRAIN TO VIETNAM TO MEET DONALD TRUMP NK

ఫిబ్రవరి 27, 28న ట్రంప్, కిమ్ భేటీ... రైల్లో వియత్నాం బయలుదేరిన కిమ్ జోంగ్ ఉన్

ఫిబ్రవరి 27, 28న ట్రంప్, కిమ్ భేటీ... రైల్లో వియత్నాం బయలుదేరిన కిమ్ జోంగ్ ఉన్

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ (File)

Trump Kim Meet : ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి హనోయి వరకు 2,700 కిలోమీటర్లు. ఈ రైలు ప్రయాణానికి 48 గంటల సమయం తీసుకుంటుంది. కిమ్ రైల్లో ప్రయాణించాలని ఎందుకు అనుకున్నారు.

  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌... మరోసారి భేటీ కాబోతున్నారు. ఇందుకు వియత్నాం వేదిక కాబోతోంది. ఈ భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన శనివారం వెలువడింది. తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్... వియత్నాం వెళ్తున్నారనీ, ఆయన రైల్లో ప్రయాణిస్తున్నారని ఉత్తర కొరియా తెలిపింది. ట్రంప్-కిమ్‌లు గతేడాది సింగపూర్‌లో తొలిసారి భేటీ అయ్యారు. అణ్వాయుధాలను వీడి... శాంతియుత మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జరగబోయేది రెండో భేటీ. ఈ మీటింగ్ కోసం కిమ్... నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ట్రైన్ ఎక్కారు. ఈ ట్రైన్... చైనా మీదుగా వియత్నాం వెళ్తుంది. పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే ట్రైన్.. చైనీస్ సరిహద్దు అయిన దన్‌డోంగ్ నగరాన్ని దాటుకుంటూ ముందుకుసాగింది.

kim jong un, donald trump, donald trump kim jong un, donald trump vs kim jong un, president trump, trump kim summit, donald trump kim jong un vietnam, trump kim meeting, trump kim jong un, kim jong un haircut, kim jong un hair, డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, కిమ్ జోంగ్ ఉన్, నార్త్ కొరియా అధ్యక్షుడు, ఉత్తర కొరియా, ట్రంప్ కిమ్ భేటీ
కిమ్, ట్రంప్ (File)


డొనాల్డ్ ట్రంప్‌, కిమ్ జాంగ్ ఉన్... ఫిబ్రవరి 27, 28న భేటీ కాబోతున్నారు. అణు నిరాయుధీకరణపై చర్చించబోతున్నారు. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి హనోయి వరకు 2,700 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి 48 గంటల సమయం తీసుకుంటుంది. కిమ్ తలచుకుంటే ప్రత్యేక విమానంలో బయలుదేరి గంటలో వియత్నాం చేరుకోగలరు. కాకపోతే ఈసారి ఆయన ప్రత్యేకంగా రైల్లోనే ప్రయాణించాలని నిర్ణయించారు.

కిమ్‌తో భేటీపై అమెరికా కూడా సానుకూలంగా ఉంది. ఇలాంటి మరిన్ని సమావేశాలు తమ మధ్య జరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. శాంతి నెలకొల్పేందుకు ఎన్ని భేటీలైనా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

 

ఇవి కూడా చదవండి :


మార్చి 7-10 మధ్యలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్... ఏర్పాట్లలో ఈసీ


జుట్టు ఎందుకు తెల్లబడుతుంది... అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?


ఏటీఎం పిన్‌ మర్చిపోయారా... రీసెట్ చేసుకోవచ్చు... ఇలా చెయ్యండి...


తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...

First published: