• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • NORTH KOREA REPORTEDLY BLOWS UP KAESONG LIAISON OFFICE NEAR BORDER WITH SOUTH KOREA MK

Korean War: కయ్యానికి కాలుదువ్విన కిమ్...దక్షిణ కొరియాపై బాంబులతో దాడి...

Korean War: కయ్యానికి కాలుదువ్విన కిమ్...దక్షిణ కొరియాపై బాంబులతో దాడి...

కిమ్ జోంగ్ ఉన్ (File)

కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు సరిహద్దుల్లో దక్షిణ కొరియాతో చర్చల కోసం నిర్మించిన ఉమ్మడి కార్యాలయంపై ఉత్తర కొరియా సైన్యం బాంబు దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ కార్యాలయం ఉత్తర కొరియా సరిహద్దులోని కైసోంగ్ నగరంలో ఉంది.

  • Share this:
    కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు సరిహద్దుల్లో దక్షిణ కొరియాతో చర్చల కోసం నిర్మించిన ఉమ్మడి కార్యాలయంపై ఉత్తర కొరియా సైన్యం బాంబు దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ కార్యాలయం ఉత్తర కొరియా సరిహద్దులోని కైసోంగ్ నగరంలో ఉంది. సరిహద్దు వద్ద కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా దక్షిణ కొరియా ప్రజలు నిరంతరం పోస్టర్-కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని, తప్పుడు సమాచారంతో కూడిన బెలూన్‌లను పంపుతున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది. సోమవారం, కిమ్ జోంగ్-ఉన్ సోదరి మరియు ఆమె రాజకీయ సలహాదారు కిమ్ యో-జోంగ్ దక్షిణ కొరియాను ఇలాంటి చర్యలను ఆపమని హెచ్చరించారు, లేకుంటే తీవ్రమైన పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలను దృష్టిలో ఉంచుకుని దౌత్య సంబంధాలను కొనసాగించడానికి ఈ కార్యాలయం 2018 సంవత్సరం నుండి ప్రారంభించారు. దక్షిణ కొరియా అధికారులు కూడా ఇక్కడ కూర్చునేవారు.

    దక్షిణ కొరియా సైనిక వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి, ఉత్తర కొరియా సైన్యం ఈ కార్యాలయాన్ని బాంబులతో పేల్చింది. కిన్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కొరియా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గతంలో ఉత్తర కొరియా ఇదే విషయమై... దక్షిణ కొరియాను హెచ్చరించి, కిమ్ జోంగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆపమని కోరింది.

    సరిహద్దు దాటి పంపిన కిమ్ జోంగ్ ఉన్ను విమర్శించడమే కాదు బెలూన్ల ద్వారా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతకుముందు, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాపై సైనిక చర్యకు దిగుతామని బెదిరించింది.

    సరిహద్దులోని పనికిరాని అనుసంధాన కార్యాలయాన్ని మూసివేయడాన్ని దక్షిణ కొరియా త్వరలో చూస్తుందని కిమ్ గతంలో అన్నారు. దక్షిణ కొరియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉత్తర కొరియా సైన్యం సిద్ధంగా ఉందని కిమ్ సోదరి తెలిపింది. కిమ్ యో జోంగ్ ప్రకటన తరువాత, దక్షిణ కొరియా సరిహద్దుకు దళాలను పంపించడానికి మరియు సైనిక నిఘా పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియా సైన్యం తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు