Kim Jong-Un: ఉత్తర కొరియాలో అరుదైన సంఘటన.. పాతికేళ్ల తర్వాత ఆ పని చేసిన అధ్యక్షుడు

కిమ్ జొంగ్ ఉన్ (ఫైల్)

Kim jong Un letter To People: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన సహజ రీతికి భిన్నంగా ప్రవర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దేశంలోని ప్రతీ ఇంటికి కొత్త సంవత్సరం రోజున లేఖలను పంపించారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    ఉత్తరకొరియాలో ఓ అరుదైన సంఘటన జరిగింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతికేళ్ల తర్వాత జరిగిన ఓ సీన్.. మళ్లీ ఇప్పుడు పునరావృతమయింది.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన సహజ రీతికి భిన్నంగా ప్రవర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దేశంలోని ప్రతీ ఇంటికి కొత్త సంవత్సరం రోజున లేఖలను పంపించారు. సాధారణంగా అయితే ప్రతియేటా నూతన సంవత్సరం మొదటి రోజున దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ టీవీల్లో ప్రసంగించి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేవారు. ఇప్పటిదాకా ఆయన ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తొలిసారిగా కిమ్ తన పద్దతిని మార్చుకుని దేశంలోని రెండున్నర కోట్ల మంది ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఉత్తరాలు పంపించారు.

    ‘విపత్కర సమయాల్లో నాకు మీరు ఎంతగానో తోడ్పాటునందించారు. నాపై నమ్మకాన్ని ఉంచారు.. అందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాపై, మన పార్టీపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోను.. మన పూర్వీకుల ఆదర్శాలు, ఈ దేశ ప్రజల కోరికలు నెరవేరి, ఉత్తర కొరియాలో ఓ కొత్త శకం ప్రారంభమయేలా పరిపాలన చేస్తాను. దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను‘ అని కిమ్ జాంగ్ ఉన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

    ఇలా దేశ ప్రజలందరికీ ఒకేసారి లేఖలు రావడం ఉత్తర కొరియాలో 1995లో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కిమ్ జాంగ్ ఆ ఆనవాయితీని పాటించి ప్రజలను ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతూ కిమ్ జాంగ్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు కఠిన మైన ఆంక్షలను విధించడం వల్ల దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశాలతో సంబంధాలు తెగిపోవడంతో లక్షలాది మంది పౌరులు ఉద్యోగాలు కోల్పోయారని, దేశం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని వాపోయారు. ఎంతగానో శ్రమించినప్పటికీ కష్టాల్లో కూరుకుపోయామని, దీనికి తనను మన్నించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ లేఖలు పంపించారు.
    Published by:Srinivas Munigala
    First published: