ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

సెంట్రల్ మిలటరీ కమిషన్‌తో అణ్వాయుధాల సామర్థ్యం గురించి చర్చించేందుకు కిమ్ సమావేశం అయ్యారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.


Updated: May 25, 2020, 10:16 AM IST
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
కిమ్ జోంగ్ ఉన్ (File)
  • Share this:
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరు వింటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉండే ఉంటుంది అనుకుంటాం. అణు పరీక్షలతో హడలెత్తించిన ఈయన.. ఈ మధ్య బయట కనిపించకుండా అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. మళ్లీ ఒక్కసారిగా ప్రత్యక్షమై ఆశ్చర్యానికి గురి చేశాడు. మళ్లీ.. 25 రోజలుగా కనిపించకుండాపోయాడు. చాలా రోజుల తర్వాత కనిపించినా.. అతడు అసలు కిమ్ కాదని వార్తలు హల్‌‌చల్ చేశాయి. దీంతో అందరి మెదళ్లలో అసలు కిమ్ ఎటు పోయాడు? ఎక్కడున్నాడు? బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే, తాజాగా ఇప్పుడు ఓ సమావేశంలో ప్రత్యక్షమై మరోసారి ట్రెండ్ అయ్యాడు.

సెంట్రల్ మిలటరీ కమిషన్‌తో అణ్వాయుధాల సామర్థ్యం గురించి చర్చించేందుకు సమావేశం అయ్యారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ సమావేశంలో అణు సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా విధివిధానాలు రూపొందించినట్లు తెలుస్తోంది. సైనిక వ్యవస్థ బలోపేతంపైనా కిమ్ దృష్టి సారించినట్లు, ఆ విషయంపైనా చర్చించారని సమాచారం. అణు పరీక్షలకు అమెరికా సిద్ధం అవుతోందని వార్తలు వచ్చిన తరుణంలో కిమ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 25, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading