హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kim Jong Un: మరింత స్లిమ్​గా మారిన కిమ్ జాంగ్ ఉన్​.. నార్త్ కొరియా నేత బరువుపై మీడియా ఎందుకు ఫోకస్ చేస్తోందంటే..

Kim Jong Un: మరింత స్లిమ్​గా మారిన కిమ్ జాంగ్ ఉన్​.. నార్త్ కొరియా నేత బరువుపై మీడియా ఎందుకు ఫోకస్ చేస్తోందంటే..

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

కిమ్​లో శారీరంగా మార్పు కనిపించినప్పుడల్లా ఆయనకు ఏదో అయిందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటాయి. కిమ్ సన్నబడిన విషయాన్ని అంతగా ఎందుకు నార్త్ కొరియా మీడియా ఫోకస్ చేస్తున్నది?

ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్​ (Kim Jong Un)  ఏం చేసినా ​ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తుంది. తన దుందుడుకు మాటలు, చేష్టలతో శత్రు దేశాలకు కిమ్​ ఎప్పుడూ హెచ్చరికలు చేస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతుంటారు. ఆణ్వాయుధ (Nuclear Weapons) సామర్థ్యంతో భయపెడుతుంటారు. అయితే కిమ్ జాంగ్ ఉన్ బరువు తగ్గడం కూడా హాట్ టాపిక్​గా మారింది. ఈ ఏడాది జూన్​లో కాస్త సన్నబడినట్టు కనిపించిన కిమ్.. తాజాగా మరింత స్లిమ్​గా మారారు. చాలా బరువు తగ్గినట్టు కనిపించారు. కిమ్​లో శారీరంగా మార్పు కనిపించినప్పుడల్లా ఆయనకు ఏదో అయిందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటాయి. కిమ్ సన్నబడిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రధానంగా పేర్కొంటున్నాయి.

తాజాగా ఉత్తర కొరియాలో జరిగిన మిలటరీ శునకాల ప్రదర్శన పరేడ్​ను వీక్షించేందుకు అధ్యక్షుడు కిమ్​ జాంగ్ ఉన్ బయటికి వచ్చారు. గతంలో కంటే ఆయన చాలా సన్నగా.. మరింత ఫిట్​గా కనిపించారు. క్రీమ్​ కలర్ సూట్​, మెరుపులతో ఉన్న తెలుపు టై కట్టుకొని కిమ్ మెరిశారు. పరేడ్ చూసేందుకు వచ్చిన ప్రజలకు చేయి ఊపుతూ అభివాదం చేసిన కి​మ్​.. తనకు పువ్వులను అందించి స్వాగతం చెప్పిన చిన్నారులకు ముద్దులు ఇచ్చారు. ఆ తర్వాత బాల్కనీకి చేరి పరేడ్​ను వీక్షించారు. కార్యక్రమం ఆసాంతం కిమ్ ఉత్సాహంగా ఉండి.. తన ఆరోగ్యంపై రేగిన అనుమానాలను పటాపంచలు చేశారు.

మూడు సంవత్సరాల నుంచి కిమ్ ఆరోగ్యంపై అనుమానాలు రేగాయి. 2018లో దౌత్య ఒప్పందాల కోసం దక్షిణ కొరియా అధ్యక్షుడు మౌంట్ పక్టుతో సమావేశం అయిన సందర్భంలో కిమ్ శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫుటేజీ సైతం అప్పట్లో బయటికి వచ్చింది. అప్పటి నుంచి కిమ్ తన ఆరోగ్యం, బరువుపై దృష్టి పెట్టినట్టు కొన్ని కథనాలు వెల్లడించాయి.

INDvsENG: రెండు నిమిషాల్లో స్టేట్‌మెంట్ మార్చిన ఈసీబీ.. తెర వెనుక ఏం జరిగింది? 5వ టెస్టు మళ్లీ ఎప్పుడంటే!!


 ఈ ఏడాది కొన్ని వారాల పాటు ఉత్తర కొరియా నేత కిమ్ బయటికి రాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు రేగాయి. అయితే ఈ ఏడాది జూన్​లో స్లిమ్​గా మారి కిమ్ బయటికి వచ్చారు. అప్పటికే డౌట్లు వచ్చాయి. కాగా, కిమ్ ఎత్తు 170 సెంటీమీటర్లు (5 అడుగుల 8 అంగుళాలు) ఉండగా.. దాదాపు 140 కిలోల బరువు ఉండేవారట. అయితే జూన్ నాటికి కిమ్ దాదాపు 20 కిలోల బరువు తగ్గారట. ఇప్పుడు మరింత బరువు తగ్గినట్టు కనిపిస్తున్నారు. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టిన కారణంగా బరువు తగ్గేందుకు కిమ్ శ్రమిస్తున్నారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.


Ranji Trophy: బ్యాటింగ్‌లో బ్యాక్‌ఫుట్ షాట్లు నేర్పింది ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది?


 అయితే కిమ్ ఆరోగ్యంపై ప్రపంచానికి ఎందుకంత ఆసక్తి అంటే.. అణ్వాయుధాలు అని చెప్పవచ్చు. నార్త్ కొరియా వద్ద అణు ఆయుధాలు చాలా ఉన్నాయి. దీంతో అమెరికా, దక్షిణ కొరియా సహా మరికొన్ని దేశాలకు ఆందోళనగా మారింది. అమెరికా సహ దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన అధునాతన అణ్వాయుధ ప్రోగ్రామ్​ను తన తర్వాత ఎవరు ఆపరేట్ చేస్తారనేది కిమ్ ప్రకటించలేదు. దీంతో ఒకవేళ కిమ్​కు ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటన్నది ఆందోళన. మరోవైపు కిమ్​ మద్యం విపరీతంగా తాగుతారు. అలాగే వంశపారపర్యంగా గుండె సమస్యలు కూడా వచ్చాయి. దీంతో బరువు పెరగడం గుండెకు మరింత ప్రమాదం కావడంతో.. స్లిమ్​గా మారేందుకు కిమ్​ జాంగ్ ఉన్ కష్టపడుతున్నారు.

Published by:John Kora
First published:

Tags: Kim jong un, North Korea

ఉత్తమ కథలు