కాఫీ రూ.7వేలు.. అరటి పండ్లు రూ.3వేల పైనే.. రైతులకు మూత్రమే దిక్కు.. ఏంటీ దుస్థితి?

ప్రతీకాత్మక చిత్రం

North Korea Food Crisis: గతంలో చైనా నుంచి ఉత్తర కొరియా 2.5 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకునేది. కానీ ఇప్పుడా దిగుమతుల విలువ 500 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 1990ల్లో వేల మందిని పొట్ట‌న‌పెట్టుకున్న ఆహార సంక్షోభ‌మే ఇప్పుడూ ఉత్త‌ర కొరియాలో ఉంని నిపుణులు చెబుతున్నారు.

 • Share this:
  ఏంటీ ధరలని ఆశ్చర్యపోతున్నారా..! ఇవి నిజం. ఉత్తర కొరియాలో కాఫీ తాగాలంటే రూ.7వేలు ఖర్చుపెట్టాలి. కిలో అరటి పండ్లు రూ.3,300 పలుకుతున్నాయి. అంతేకాదు బ్లాక్ టీ ప్యాకెట్ రూ.5వేలు,  కిలో మొక్కజొన్న గింజలు రూ.204.81. ఇంత ధరలు ఎందుకనుకుంటున్నారా? అక్కడ అంతలా తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. ప్రజలు తినేందుకు తిండి గింజలు దొరకడం లేదు. ఆహార ధాన్యాల కొరత నేపథ్యంలో వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను సామాన్యుడు కొనలేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

  ఉత్తర కొరియాలో ఆహార కొరతకు మూడు ప్రధాన కారణాలున్నాయి. కరోనా కారణంగా దేశ సరిహద్దులను మూసివేయడం, ఉత్తర కొరియాపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షలు, దేశంలో వరదలు. వీటి వల్లే అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో వ్యవసాయంరంగం కుదేలయింది. ఎరువులు దొరకడం లేదు. ఆహారం, ఎరువులు, విత్తనాలు, ఇంధనం కావాలంటే చైనానే దిక్కు. కానీ కరోనా భయంతో దేశ సరిహద్దులను మూసివేడయంతో.. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమకు అవసరమైన వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఉన్న పంటలు కూడా భారీ వరదల కారణంగా కొట్టుకుపోయాయి. రైతులు ఎంతో నష్టపోయారు. ఈ క్రమంలోనే దేశంలో ఎరువుల తయారీపై ఉత్తర కొరియా దృష్టిపెట్టింది. ఎరువుల తయారీ కోసం ప్రతి రైతు రోజుకు 2 లీటర్ల మూత్రాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అడుగుతోంది. అక్కడ ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో.. దీన్ని బట్టే అర్ధమవుతోంది.

  గతంలో చైనా నుంచి ఉత్తర కొరియా 2.5 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకునేది. కానీ ఇప్పుడా దిగుమతుల విలువ 500 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 1990ల్లో వేల మందిని పొట్ట‌న‌పెట్టుకున్న ఆహార సంక్షోభ‌మే ఇప్పుడూ ఉత్త‌ర కొరియాలో ఉంని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశఅధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా దేశంలో ఆహార సంక్షోభం ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ద‌ని అంగీక‌రించారు. క‌రోనా పరిస్థితులు మాత్రమే కాదు.. అణ్వాయుధాల‌ను క‌లిగి ఉన్న కార‌ణంగా అంత‌ర్జాతీయ స‌మాజం ఉత్తర కొరియాపై ఎన్నో ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) తెలిపింది. ఇది ఆ దేశానికి 2 నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం.
  Viral News, Kim Jong Un Watch Price,North Korean leader Kim Jong Un, North Korea, Kim Jong Un, health, weight, heart disease, heavy smoker, Seoul, ఉత్తర కొరియా, కిమ్ జోంగ్ ఉన్, ఆరోగ్యం, బరువు, సియోల్
  Photo Credit : Twitter

  దేశంలో ఆహార కొరతకు సంబంధించి ఇటీవల ఉన్నతాధికారులతో దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న సమీక్ష నిర్వహించారు. ఆహార సంక్షోభ నివారణకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశాలు జారీచేశారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం కొనసాగుతాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో ప్రజల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా.. తాను చెప్పిందే వినాలన్న అధ్యక్షుడి నియంతృత్వం వల్లే ఈ సమస్యలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: