హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kim Jong Un: కిమ్ మూత్రంలో అంత సీక్రెట్ ఏముంది? టాయిలెట్ కుండీకి భారీగా సెక్యూరిటీ ఎందుకు?

Kim Jong Un: కిమ్ మూత్రంలో అంత సీక్రెట్ ఏముంది? టాయిలెట్ కుండీకి భారీగా సెక్యూరిటీ ఎందుకు?

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ ఎవరినీ నమ్మడు. ఆఖరికి తన నీడను కూడా తాను విశ్వసించడు. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా.. తనతో పాటు తన వ్యక్తిగత టాయిలెట్‌ని కూడా తీసుకెళ్లిపోతాడు.

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ ఎవరినీ నమ్మడు. ఆఖరికి తన నీడను కూడా తాను విశ్వసించడు. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా.. తనతో పాటు తన వ్యక్తిగత టాయిలెట్‌ని కూడా తీసుకెళ్లిపోతాడు.

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ ఎవరినీ నమ్మడు. ఆఖరికి తన నీడను కూడా తాను విశ్వసించడు. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా.. తనతో పాటు తన వ్యక్తిగత టాయిలెట్‌ని కూడా తీసుకెళ్లిపోతాడు.

  ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం గురించి ఇతర దేశాలకు ఎంతో కొంత తెలుసు. కానీ ఒక్క ఉత్తర కొరియా (North Korea) గురించి మాత్రమే ఎవ్వరికీ ఏమీ తెలియదు. అక్కడి ప్రజలు ఎలా ఉంటారు? ఎలాంటి జీవితం గడుపుతున్నారు? ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఈ వివరాలేవీ బయటకు రావు. పొరపాటున ఎవరైనా బయటకు లీక్ చేస్తే.. మరు క్షణం వారు ఈ భూమిపై ఉండరు. ఎందుకంటే అక్కడ అత్యంత క్రూరమైన నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) పాలన నడుస్తోంది. ఉత్తర కొరియా దేశం ఎంత రహస్యంగా ఉందో.. ఆ దేశాధ్యక్షుడి జీవితం కూడా అంతే రహస్యమైనది. కిమ్ జోంగ్ గురించి కూడా ఎలాంటి సమాచారమూ బయటకు రాదు. అసలు ఇప్పుడతను ఎలా ఉన్నాడు? ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కూడా బయటి ప్రపంచానికి తెలియదు. అంత గోప్యంగా అక్కడ పాలన (Secret Country In World) సాగుతోంది.

  ఫుట్‌బాల్ టీమ్‌ నుంచి గెంటేశారు.. కానీ ఇప్పుడు నగ్న వీడియోలతో కోట్లల్లో సంపాదన

  కిమ్ జోంగ్ మరణించారని (Kim Jong Un Death) గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆయన స్వయంగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించి ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక కిమ్ సన్నబడ్డారని.. బరువు బాగా తగ్గారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారిపోయాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐతే దీనికి తోడు ఇంకో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దాని గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

  అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. కిమ్ జాంగ్ ఉన్ తన వ్యక్తిగత మెర్సిడెస్‌ బెంజ్ కారు (Mercedes Benz Car)లో ప్రత్యేకమైన టాయిలెట్‌ను (Kim Jong Un Toilet) తయారు చేయించుకున్నాడు. వాస్తవానికి కిమ్ జోంగ్ ఉన్ ఎవరినీ నమ్మడు. ఆఖరికి తన నీడను కూడా తాను విశ్వసించడు. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా.. తనతో పాటు తన వ్యక్తిగత టాయిలెట్‌ని కూడా తీసుకెళ్లిపోతాడు. ఆ టాయిలెట్ పాట్టీ (కుండీ) శత్రువుల చేతికి చిక్కితే.. తన ప్రాణాలకే ప్రమాదమని కిమ్ భావిస్తాడు. ఆ కుండీ ద్వారా తన గురించి చాలా రహస్యాలు బయటకు వెళ్లే ప్రమాదముందని భయపడతాడు. అందుకే తాను ఎక్కడికి వెళ్లినా మెర్సిడెస్ బెంజ్ కారును వెంట తీసుకెళతాడు. అందులో టాయిలెట్ ఉంటుంది. కేవలం అక్కడే కాలకృత్యాలను తీర్చుకుంటాడు కిమ్ జోంగ్ ఉన్. ఇంకే మరుగుదొడ్డినీ అతడు వినియోగించడు.

  Roti Cook: రోటీలు చేయడమే జాబ్.. వీరికి ఫుల్ డిమాండ్.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

  కిమ్ జోంగ్ ఉన్‌కు చాలా కార్లున్నాయి. వాటిలో కూడా మరుగు దొడ్డి ఉంటుంది. కేవలం వాటిలోనే అతడు మలమూత్ర విసర్జన చేస్తాడు. ఎందుకంటే అతడికి పబ్లిక్ రెస్ట్ రూమ్స్‌పై నమ్మకం లేదు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్‌ కారులోనూ టాయిలెట్ నిర్మించుకున్నాడు కిమ్ జోంగ్. ఇదే కాకుండా అతని ఇతర వాహనాల్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. కిమ్ జోంగ్ ఎప్పుడైనా బయటకు వస్తే.. అనే కార్ల కాన్వాయ్‌లో బయలుదేరుతాడు. ఆ కాన్వాయ్‌లో కిమ్ ఏ కారులో ఉన్నాడో బయటి ప్రజలకు తెలిసే ప్రసక్తే లేదు. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసమే కిమ్ ఇంత జాగ్రత్త పడతాడు. ఐతే ఏ కారులో ఉన్నప్పటికీ.. అందులో ఖచ్చితంగా టాయిలెట్ ఉంటుంది.

  మసాజ్ కోసం వెళ్లి బట్టలు విప్పాడు..అమ్మాయి చేయి తగలగానే చనిపోయాడు.. ఏం జరిగింది?

  కిమ్ జోంగ్‌కు చాలా మంది బాడీ గార్డ్స్ ఉంటారు. వారు కేవలం కిమ్‌పైనే కాదు.. ఆయన ఉపయోగించే టాయిలెట్స్‌పైనా నిఘా ఉంచుతారు. వాటికి ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఎవరైనా కిమ్ టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిస్తే.. మరుక్షణం ఆలోచించకుండా అతడికి మరణశిక్ష విధిస్తారు. తన టాయిలెట్ పాట్టీ ద్వారా శత్రువులు తన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తాడు. తద్వారా కిమ్ జోంగ్ ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? ఆయన బలహీనత ఏంటన్నది తెలిసిపోతుంది. శత్రువులకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే.. తన టాయిలెట్‌ పాట్టీకి సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. అక్కడికి టాయిలెట్ ఉన్న కారును తీసుకెళ్తారు.

  First published:

  Tags: International, International news, Kim jong un, North Korea

  ఉత్తమ కథలు