NORTH KOREA CONFIRMS ITS FIRST EVER CASE OF COVID AND KIM JONG UN ORDERS NATIONWIDE COVID LOCKDOWN SK
North Korea: కరోనా వచ్చిన 2 ఏళ్ల తర్వాత నార్త్ కొరియాలో తొలి కేసు.. కిమ్ సంచలన నిర్ణయం
కిమ్ జోంగ్ ఉన్ (ఫైల్)
North Korea 1st Corona case: కరోనా ముప్పును ముందే పసిగట్టి చాలా దేశాలు పౌరులకు టీకాలు వేసినా.. తమ దేశానికి కరోనా రాబోదని భావించి.. నార్త్ కొరియా ప్రజలకు అక్కడి ప్రభుత్వం టీకాలు వేయించలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కరోనా ఎంట్రీ ఇవ్వడంతో.. కిమ్ జోంగ్ ఉన్ సీరియస్‌గా తీసుకున్నారు.
రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ (Coronavirus) యావత్ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసింది. చిన్న, పెద్ద.. పేద, ధనిక దేశాలని తేడా లేకుండా అన్నింటినీ గజగజా వణికించింది. కానీ ఒకే ఒక్క దేశంలోకి మాత్రం వెళ్లలేకపోయింది. కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. అదే నార్త్ కొరియా. కానీ కరోనా వచ్చిన ఇన్ని రోజుల తర్వాత.. ఎట్టకేలకు ఉత్తర కొరియాలోకి ప్రవేశించింది. ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియాలో (First Corona case in North Korea)కి కరోనా వ్యాపించడంతో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉంగ్ (Kim Jong Un) సంచలన నిర్ణయం ప్రకటించారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎమర్జెన్సీ (Severe national emergency)తో పాటు కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ప్రజలంతా లాక్‌డౌన్ (North Korea Lockdown) నిబంధనలను పాటించాలని..లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనాపై యుద్ధం మొదలయిందని... వీలైనంత త్వరగా ఆ మహమ్మారిని దేశం నుంచి తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.
2020, 2021లో అన్ని దేశాలు కరోనాతో ఇబ్బంది పడ్డాయి. ఈ వ్యాధి బారిన పడి లక్షాలాది మంది మరణించారు. 2021 ప్రారంభంలో చాలా దేశాలు కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. భారత్ సహా చాలా దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌ను దాదాపుగా పూర్తి చేశాయి. 90శాతం మందికి పైగా ప్రజలు రెండో డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. అప్పటికి నార్త్ కొరియాలో కరోనా కేసులు నమోదు కాలేదు ఫిబ్రవరి 2020 నుండి 2 సంవత్సరాల 3 నెలల పాటు ప్రజలు సేఫ్‌గా ఉన్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అక్కడ తొలి కరోనా కేసు వచ్చింది. అది కూడా ఒమిక్రాన్ BA.2 వేరియెంట్. కరోనా ముప్పును ముందే పసిగట్టి చాలా దేశాలు పౌరులకు టీకాలు వేసినా.. తమ దేశానికి కరోనా రాబోదని భావించి.. నార్త్ కొరియా ప్రజలకు అక్కడి ప్రభుత్వం టీకాలు వేయించలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కరోనా ఎంట్రీ ఇవ్వడంతో.. కిమ్ జోంగ్ ఉన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఎమెర్జెన్సీతో పాటు లాక్‌డౌన్ విధించి.. కరోనా కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాగా, తమ దేశంలో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా గతంలో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో.. తమ దేశ సరిహద్దులన్నింటినీ మూసివేసింది. విమాన రాకపోకలను నిలిపివేసింది. దాదాపు రెండేళ్లపాటు దేశానికి వచ్చే వ్యాపారులు, పర్యాటకులందరినీ నిషేధించింది. అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాల కారణంగా ఇప్పటికే అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ.. కరోనా వైరస్ ఆంక్షల కారణంగా మరింత ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.