అమెరికాతో దౌత్యానికి బ్రేక్ పడటంతో (diplomacy stalled with America) ఉత్తర కొరియా (North Korea) క్షిపణి ప్రయోగాల యాక్టివిటీని జోరుగా కొనసాగిస్తోంది. ఇది యూఎస్‌ను తిరిగి చర్చలకు ఒప్పించేందుకు వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ అందర్నీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ దిక్కార స్ట్రాటజీతో అమెరికాను చర్చల స్థాయికి (negotiation level) తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియా తన తూర్పు తీరంలోని సముద్రంలో రెండు క్రూయిజ్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా (South Korea) మంగళవారం వెల్లడించింది. దీంతో ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్షిపణుల స్వభావాన్ని తెలుసుకోవడానికి తమ సైన్యం ప్రయోగాలను అంచనా వేస్తోందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. తాజా పరీక్షతో ఉత్తర కొరియా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐదు క్షిపణులను పరీక్షించినట్లయింది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన మిలిటరీని అత్యాధునిక సాంకేతికత, వనరులతో బలపరచడంలో వెనకడుగు వేయకుండా దూకుడుగా ఉన్నారనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
OMG: కుక్కల పురుషాంగాలకు అక్కడ భలే డిమాండ్.. నూనెలో ఫ్రై చేసుకొని లాగిస్తారు..
అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చలు నిలిచిపోవడంతో ఉత్తర కొరియా ఈ నెల ప్రారంభంలో మరో నాలుగు క్షిపణులను పరీక్షించింది. మొదటిసారిగా ఉత్తర కొరియా జనవరి 6న హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. జనవరి 10న మరో బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. జనవరి 13న మరో రెండు హైపర్‌సోనిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ క్షిపణి ప్రయోగాలను కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. నాల్గవ క్షిపణి పరీక్షను జనవరి 16న జపాన్ తీరంలో నిర్వహించింది. నాలుగవ క్షిపణి నిర్వహణలో స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించి తన చిరకాల ప్రత్యర్థులైన దక్షిణ కొరియా, అమెరికాలపై ఒత్తిడి పెంచింది.
ఉత్తర కొరియా పలు ఆంక్షల కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా దెబ్బతో ఇది మరింత సంక్షోభం లోకి జారుకుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో సంక్షోభంపై రష్యాతో అమెరికా ప్రచ్ఛన్నయుద్ధం వంటి ప్రతిష్టంభనలో చిక్కుకుంది. అదే సమయంలో ఉత్తర కొరియా దాని పొరుగు దేశాలను, యూఎస్‌ను దాని అణు ఆశయాలతో భయపెడుతోంది. ఉత్తర కొరియా హ్వాసాంగ్-12, హ్వాసాంగ్-14, హ్వాసాంగ్-15 ఇలా అన్ని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను 2017లో పరీక్షించింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో క్షిపణులను ప్రయోగిస్తూ ఆందోళనలను రేకెత్తిస్తోంది. అప్పట్లో ఇది అణు విస్ఫోటన అత్యంత శక్తివంతమైన రూపమైన థర్మోన్యూక్లియర్ ఆయుధ పరీక్షను కూడా నిర్వహించింది.
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తో చర్చలు జరపడమే లక్ష్యం..
ఉత్తర కొరియాపై అమలవుతున్న ఆంక్షలు ఆ దేశాన్ని అన్ని విధాలా బలహీన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చర్చలలో బైడెన్ పరిపాలనను నిమగ్నం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ పరీక్షలు సూచించవచ్చని వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. టఫ్ట్స్ యూనివర్శిటీలోని ఫ్లెచర్ స్కూల్‌లో ఉత్తర కొరియా నిపుణుడు లీ సుంగ్-యూన్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. కిమ్ సాధారణ స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తారని, ఆపై మధ్యంతర, దీర్ఘ-శ్రేణి క్షిపణి పరీక్షలను పునఃప్రారంభిస్తారని చెప్పారు.
కిమ్ జోంగ్ ఉన్ 2017లో ఇలాంటి ట్రిక్స్ యే ప్లే చేశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా.. ఆంక్షలను సడలించడానికి, రాయితీలను ఇవ్వడానికి వాషింగ్టన్‌ను బలవంతపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తర కొరియా ఆర్థిక పరిస్థితి మరింత దిగజార్చడంతో ఆ వ్యవస్థను యథాస్థితికి తేవడానికి కిమ్ ఇప్పుడు పోరాడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Kim jong un