Home /News /international /

NORTH KOREA CLAIMS SUCCESSFUL LAUNCH OF MONSTER MISSILE HWASONG 17 PVN

North Korea : హాలీవుడ్ మూవీ రేంజ్ లో..రాకాసి క్షిపణి ప్రయోగించిన కిమ్..వీడియో

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

Kim Jong Un : ఉత్తరకొరియా అమ్ములపొదిలో అత్యంత సుదూర లక్ష్యాలను చేరుకునే ఆయుధంగా దీనిని చెప్పుకోవచ్చు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ICBM లాంచ్​ కి సంబంధించిన దృశ్యాలను ఉత్తరకొరియా విడుదల చేసింది. అది హాలీవుడ్​ సినిమా రేంజ్​లో ఉండటం గమనార్హం.

ఇంకా చదవండి ...
North Korea Missile Test  : ఉత్తరకొరియా పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది క్షిపణుల ప్రయోగమే. ఎప్పుడూ కొత్తకొత్త మిస్సైళ్ల ప్రయోగాలు చేపడుతూ ప్రపంచ దేశాలను భయపెడుతుంటారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్. దేశంలో తిండి తినేందుకు ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోకుండా భద్రత పేరుతో ఎప్పుడూ ఏదో ఒక క్షిపణిని ప్రయోగిస్తుంటారు కిమ్​. కాగా,ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఉత్తరకొరియా తాజాగా.."ICBM​(ఇంటర్​కాంటినెంటల్​ బాలిస్టిక్​ మిసైల్​)Hwasong-17"ని ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని.. ముఖ్యంగా అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఛేదించే ఈ ICBM అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగలదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రాకాసి క్షిపణిగా అభివర్ణిస్తున్నారు.

ఈ ఏడాది అరంభం నుంచి వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు పెంచిన నార్త్ కొరియా.. ఐసీబీఎం క్షిపణిని ప్రయోగించడం గత ఐదేళ్లతో ఇదే తొలిసారి. చివరిసారిగా 2017లో దీనిని ఆ దేశం పరీక్షించింది. ఉత్తరకొరియా అమ్ములపొదిలో అత్యంత సుదూర లక్ష్యాలను చేరుకునే ఆయుధంగా దీనిని చెప్పుకోవచ్చు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. దక్షిణ కొరియా సైనిక వర్గాల ప్రకారం గురువారం ప్రయోగించిన క్షిపణి 1080 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడింది. ఇది చాలా శక్తిమంతమైనదని, దాదాపు 6,200 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 71 నిమిషాలు గగనతలంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ India | China: భారత్​, చైనా విదేశాంగ మంత్రుల భేటి.. పలు విషయాలపై కీలక చర్చలు..

ఈ తాజా క్షిపణి ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నేరుగా పర్యవేక్షించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలియజేసింది. దీనిని న్యూక్లియర్ వార్ ను నిరోధించేందుకు, దేశ భద్రతలో భాగంగా కిమ్ చేస్తున్న ప్రయత్నంగా అక్కడి మీడియా చెబుతోంది. రానున్న కాలంలో ఈ క్షిపణి మల్టిపుల్ వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థానికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ICBM లాంచ్​ కి సంబంధించిన దృశ్యాలను ఉత్తరకొరియా విడుదల చేసింది. అది హాలీవుడ్​ సినిమా రేంజ్​లో ఉండటం గమనార్హం. లెథర్​ జాకెట్​, సన్​గ్లాసులు ధరించి కిమ్​.. అధికారులతో కలిసి బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. మిసైల్​ లాంచ్​ సమయంలో కిమ్​ ఓకే చెబుతున్న దృశ్యాలను స్లో మోషన్​ ఎఫెక్ట్ ​లో చూపించారు. చివరికి క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్టు కనిపించింది.

https://youtu.be/I3cWMQUmBXQ

ఇలా హాలీవుడ్​ సినిమా రేంజ్​లో మిసైల్​ లాంచ్​ను ఉత్తరకొరియా చూపించడం.. చాలా అరుదు. అగ్రదేశాలకు సవాలు విసిరేందుకే ఉత్తరకొరియా ఈ వీడియోను విడుదల చేసిందని అంటున్నారు. తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని, తమపై ఆంక్షలు తొలగించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తరకొరియా డిమాండ్‌ చేస్తోంది. అందులో భాగమే తాజా ప్రయోగమని తెలుస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Kim jong un, Missile, North Korea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు