North Korea: ఉత్తర కొరియా సైనికుల్లో ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? అతడి గురించే చర్చ ఎందుకు?

ప్రతీకాత్మక చిత్రం

North Korea Army: ఉత్తర కొరియా అధికారిక వెపన్ సిస్టమ్ ఎగ్జిబిషన్‌లో ఒక వింత దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమంలో ఒక సైనికుడు సూపర్ హీరో లాంటి ఓ సూపర్-టైట్ బ్లూ అవుట్‌ఫిట్ ధరించి ఆశ్చర్యపరిచాడు.

  • Share this:
సాధారణంగా జాతీయస్థాయి, మిలటరీ కార్యక్రమాల్లో దేశాధి నేతల నుంచి సైనికుల వరకు అందరూ యూనిఫామ్స్, ఫార్మల్ డ్రెస్సులు ధరిస్తారు. సూపర్ మాన్ (Superman), స్పైడర్ మాన్  (Spider Man) కాస్ట్యూమ్స్ ధరించడానికి ఎవరూ ధైర్యం చేయరు. కానీ ఉత్తర కొరియా (North Korea) అధికారిక వెపన్ సిస్టమ్ ఎగ్జిబిషన్‌లో ఒక వింత దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమంలో ఒక సైనికుడు సూపర్ హీరో లాంటి ఓ సూపర్-టైట్ బ్లూ అవుట్‌ఫిట్ ధరించి ఆశ్చర్యపరిచారు. ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong-Un)తో కలిసి ఫొటో దిగిన 30 మంది సైనికుల్లో ఇతగాడు ఒకడు కావడం గమనార్హం. మిలటరీ ఎగ్జిబిషన్‌లో కనిపించిన ఈ దృశ్యం ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది.

కొందరు నెటిజన్లు అతడిని సూపర్ హీరో (Super Hero), కెప్టెన్ నార్త్ కొరియా (Captain North Korea), రాకెట్ మ్యాన్ (Rocket Man) అని పిలుస్తున్నారు. సోమవారం జరిగిన ఆయుధ వ్యవస్థల ప్రదర్శన సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో దాదాపు 30 మంది సైనికులు ఫొటో దిగారు. వారిలో ఈ సూపర్ మాన్ తరహా డ్రెస్ ధరించిన సైనికుడు కూడా ఉన్నాడు. మరుసటి రోజు ఉత్తర కొరియా ఆ ఈవెంట్ ఫొటోలను ప్రచురించింది.

నాలుగేళ్ల చిన్నారి.. తన అల్లరి పనితో తల్లి ప్రాణాల మీదకు తెచ్చాడు..! ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ ఫొటోల్లో సైనికులు ఉత్తర కొరియా మిలిటరీ యూనిఫాం అయిన ఆలివ్ గ్రీన్ యూనిఫామ్‌లు ధరించినట్లు కనిపించింది. అయితే వారిలో ఇద్దరు మాత్రమే వేర్వేరు రంగులను ధరించారు. ఒకరు బ్లూ కలర్ డ్రెస్ ధరించగా.. మరొకరు నేవీ-బ్లూ యూనిఫాం ధరించి అందరిలో ప్రత్యేకంగా కనిపించారు. కిమ్ డార్క్ కలర్ సూట్ ధరించాడు.

ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో దక్షిణ కొరియా, యూఎస్ దేశాల ట్విట్టర్ యూజర్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ సైనికుడు ఏంటి "మానవ ఫిరంగి బంతి(human cannon ball)" లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ సైనికుడు కెప్టెన్ అమెరికా వలె ఉత్తర కొరియాకి కెప్టెన్ అయ్యి ఉంటాడా? అని వ్యంగ్యంగా ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అతన్ని సూపర్ హీరో, కెప్టెన్ డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రాకెట్ మ్యాన్ అనే వివిధ రకాలుగా పిలుస్తూ ఆటపట్టిస్తున్నారు.

Life Expectancy: ఆ గ్రామంలో మహిళలు 95 ఏళ్లకు పైనే జీవిస్తారు..రికార్డు స్థాయి ఆయుష్షుకు కారణం ఏంటంటే..


ఇదిలా ఉండగా ఇప్పటి వరకైతే ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా ఆ వ్యక్తి పేరు, వివరాలు వెల్లడించలేదు. ఈ క్రమంలో మాంటెరీలోని మిడిల్‌బరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిపుణుడు జెఫ్రీ లూయిస్ ఒక ట్వీట్ చేశాడు. "అతను పారాచూటిస్ట్ అని తెలుస్తోంది" అని జెఫ్రీ లూయిస్ ట్వీట్ చేశాడు. ఇతర ఉత్తర కొరియా ఫొటోల్లో ఎగ్జిబిషన్‌కు ముందు ఎయిర్ షో జెట్‌లు ఒక ఫార్మెషన్‌లో ఎగిరినట్లు కనిపించింది. కిమ్ ఈ వాయుసేన విన్యాసాలు చూసినట్లు కూడా ఈ ఫొటోలలో కనిపించింది.

"ఎగ్జిబిషన్ ప్రారంభ వేడుకకు ముందు అగ్రశ్రేణి పారాచూటిస్ట్ ల్యాండింగ్ స్కిల్స్ చూపించాడు. ఆకాశంలో ఎర్ర పార్టీ జెండా రెపరెపలాడించాడు" అని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉత్తర కొరియాలో అంతకు ముందు జరిగిన ఎయిర్ షోకి సంబంధించిన ఫొటోల్లో పారాచూటిస్టులు ఇలాంటి బ్లూ అవుట్‌ఫిట్ ధరించినట్లు కనిపించింది. దీన్నిబట్టి ఆ వ్యక్తి పారాచూటిస్ట్ కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: