కరోనా విలయానికి సంబంధించి ప్రపంచమంతా నాలుగో వేవ్ చవిచూసినా, ఉత్తరకొరియాలో మాత్రం ఇటీవలే తొలి వేవ్ విజృంభణ మొదలైంది. (Covid Surge In North Korea) గడిచిన రెండేళ్లుగా అన్ని దేశాలూ వైరస్ దెబ్బకు కుదేలైపోగా, నియంత నేత కిమ్ జోగ్ ఉన్ (Kim Jong Un) కఠిన కట్టడి చర్యలతో నార్త్ కొరియా కరోనా నుంచి దూరంగా ఉండగలిగింది. కానీ ఇప్పుడు ఆ దేశంలోకి వైరస్ చొరబడంతో పరిస్థితి తారుమారైంది. ఇన్నేళ్లూ తమ దగ్గర కొవిడ్ లేనేలేదని కరాకండిగా చెబుతూ వచ్చిన కిమ్ దేశం తొలి కేసు నమోదును, తొలి కరోనా మరణాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించడం గమనార్హం. (North Korea First Covid Death) కొవిట్ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితిని ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. వివరాలివే..
కిమ్ దేశం ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. వైరస్ పుట్టిన రెండేళ్ల తర్వాత.. మిగతా దేశాన్నీ వందశాతం వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాతగానీ మహమ్మారి ఇప్పుడు ఉత్తర కొరియాను తాకింది. నార్త్ కొరియాలో నమోదైన మొదటి కరోనా కేసుకు సంబంధించిన వివరాలను ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం నాడు ప్రకటించిది. 24 గంటలు తిరిగేలోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది.
ఉత్తరకొరియాలో నమోదైన తొలి కరోనా కేసులో రోగి పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుడిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2ను గుర్తించినట్లు పేర్కొన్నది.
Monsoon : రైతులకు శుభవార్త.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. సంవృద్ధిగా వర్షాలు: IMD
ఉత్తరకొరియా వ్యాప్తంగా 18 వేల మంది జ్వరంతో బాధపడుతున్నారని గురువారం (మే12న అధికారులు ప్రకటించారు. శుక్రవారం నాటికి ఆ సంఖ్య సంఖ్య 1,87,800కు చేరిందని.. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు చెప్పిన విషయాలను కిమ్ మీడియా ప్రచురించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధినేత కిమ్ ఉత్తరకొరియాలో ఎమర్జెన్సీ, లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మరింత కలవరపెట్టే విషయం ఏంటంటే..
కొవిడ్ పై పోరులో భాగంగా ప్రపంచ దేశాలన్నీ బూస్టర్ డోసులు సైతం తీసుకుంటోన్న వేళ ఉత్తరకొరియా ఇప్పటిదాకా వ్యాక్సిన్ ముఖంచూడలేదు. కరోనా పుట్టుకొచ్చి రెండేళ్లకు కూడా అక్కడ వైరస్ సోకని కారణంగా ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్ తిరస్కరించారు. మరి,
కరోనా కట్టడి విషయంలో ఇన్నాళ్లూ గంభీరత ప్రదర్శించిన ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాగ్ మొదటిసారిగా మాస్కు ధరించడం విశేషం. రాజధాని ప్యోంగ్యాంగ్ లో కొవిడ్ పై నిర్వహించిన కీలక సమీక్షలో కిమ్ మాస్కు పెట్టుకున్నప్పటి ఫొటోను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. కిమ్ తొలిసారి మాస్కు ధరించిన ఫొటో వైరలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, Kim jong un, North Korea, Omicron