పాక్‌కి సీన్ అర్థమైంది.. అక్కడెవరూ మనకోసం దండలతో సిద్దంగా లేరని కామెంట్..

Pakistan on Kashmir Issue : కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని.. ఈ విషయంలో పాకిస్తాన్ నిజాన్ని అంగీకరించక తప్పదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.అమెరికా,రష్యా లాంటి అగ్ర దేశాలు ఇప్పటికే భారత్ నిర్ణయానికి మద్దతుగా నిలిచాయి.

news18-telugu
Updated: August 13, 2019, 8:58 PM IST
పాక్‌కి సీన్ అర్థమైంది.. అక్కడెవరూ మనకోసం దండలతో సిద్దంగా లేరని కామెంట్..
షా మహమ్మద్ ఖురేషీ(Reuters Image)
news18-telugu
Updated: August 13, 2019, 8:58 PM IST
కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కరువైంది. ఇస్లామిక్ దేశాలు కూడా భారత్ వైపే ఉండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది.ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ మూర్ఖపు భ్రమల్లో ఉండవద్దని పాకిస్తానీలకు హితవు పలికారు.కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు ఐక్యరాజ్య సమితి మద్దతు తెలపడం అంత ఈజీ కాదన్నారు. అక్కడ మనకోసం ఎవరూ దండలు పట్టుకుని సిద్దంగా లేరని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌ విషయంలో ఐక్యరాజ్య సమితి పాక్‌కు మద్దతుగా నిలవాలంటే పాకిస్తానీలు మరో కొత్త పోరాటం మొదలుపెట్టాల్సిందే అన్నారు.ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచేందుకు సిద్దంగా లేవని.. కారణం భారత్‌తో ముడిపడి ఉన్న వారి ఆర్థిక ప్రయోజనాలే అని అన్నారు. ఇండియా అనేది ఆయా దేశాలకు కోట్లాది రూపాయల మార్కెట్ అని.. అక్కడ పెట్టుబడులే వారికి ముఖ్యమని తెలిపారు.కాబట్టి ఇస్లామిక్ దేశాలు కూడా తమకు మద్దతునిచ్చే పరిస్థితి లేదన్నారు.

కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని.. ఈ విషయంలో పాకిస్తాన్ నిజాన్ని అంగీకరించక తప్పదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.అమెరికా,రష్యా లాంటి అగ్ర దేశాలు ఇప్పటికే భారత్ నిర్ణయానికి మద్దతుగా నిలిచాయి. ఒక్క చైనా మాత్రమే లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే భారత్-పాక్ రెండూ తమకు పొరుగు దేశాలే అయినందునా కశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా లేదా సిమ్లా ఒప్పందాల ఆధారంగా చైనా తపరిష్కరించుకోవాలని సూచించింది.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...