వైద్య రంగంలో 2020కి సంబంధించి వైద్యరంగలో నోబెల్ పురస్కారాన్ని నోబెల్ కమిటీ ప్రకటించింది. వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తకు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అమెరికాకు చెందిన హార్వే జే. ఆల్టర్, చార్లెస్ ఎం.రైస్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్లు నోబెల్ పురస్కారానికి ఎంపికయినట్లు నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. హెపటైటిస్ సి వైరస్‌ను కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపింది.
జే.ఆల్టర్ అమెరికా బెథెస్డా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగంలో, హోటాన్ కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలో పరిశోధనలు చేస్తున్నారు. ఇక చార్లెస్ ఎం.రైస్.. రాక్ఫెల్ యూనివర్సిటీలోనూ పరిశోధనలు చేస్తున్నారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ మనీని సమానంగా అందజేయనున్నారు.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 5, 2020
The 2020 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to Harvey J. Alter, Michael Houghton and Charles M. Rice “for the discovery of Hepatitis C virus.” pic.twitter.com/MDHPmbiFmS
హైపటైటిస్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి. వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. హైపటైటిస్ వల్ల ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జె.హార్వే, మైకేల్ హోటాన్, చార్లెస్ ఎం.రైజ్ పరిశోధనలతో సులభంగా హైపటైటిస్‌కు మందుకు కనుగొన్నారు. వీరు కనుగొన్న హైపటైటిస్ సీ వైరస్‌తో వ్యాధిని ఎంతో మంది ప్రాణాలను వైద్యులు కాపాడగలుగుతున్నారు.
ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రతి ఏటా నోబెల్ పురస్కారాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 1895 నాటి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం.. ఆయన మరణించిన ఐదేళ్ల తర్వాత నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. మొదట భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ప్రపంచ శాంతికి కృషిచేసిన వారికి మాత్రమే నోబెల్ పురస్కారం బహుకరించేవారు. 1969 నుంచి అర్ధశాస్త్రంలోనూ పురస్కారం అందజేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమానం తప్ప మిగతా ఐదింటినీ నోబెల్ వర్ధంతి రోజు (డిసెంబరు 10)న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో ప్రధానం చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, Nobel Prize