హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

లేజర్ రీసెర్చ్‌లో సేవలు: ముగ్గురికి ఫిజిక్స్‌లో నోబెల్

లేజర్ రీసెర్చ్‌లో సేవలు: ముగ్గురికి ఫిజిక్స్‌లో నోబెల్

image: Reuters

image: Reuters

ఆర్థర్ యాష్కిన్ లేజర్ బీమ్ ఫింగర్స్‌తో కణాలు, అణువులు, వైరస్‌ను ఆకర్షించే "ఆప్టికల్స్ ట్వీజర్స్‌"ని కనిపెట్టారు. డొన్నా స్ట్రిక్‌ల్యాండ్ గెరార్డ్ మౌరౌతో కలిసి అత్యంత చిన్నవి, తీవ్కమైన లేజర్ పల్సెస్‌ని సృష్టించారు. వీరి ఆవిష్కరణలు కంటి సర్జరీలతో పాటు వివిధ రంగాలకు ఉపయోగపడ్డాయి.

ఇంకా చదవండి ...

ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ ముగ్గురు పరిశోధకుల్ని వరించింది. లేజర్ ఫిజిక్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణల్ని చేసిన ముగ్గుర్ని 2018 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ కోసం ఎంపిక చేశారు. వీరి ఆవిష్కరణలు కంటి సర్జరీలతో పాటు వివిధ రంగాలకు ఉపయోగపడ్డాయి.

అమెరికాకు చెందిన 96 ఏళ్ల ఆర్థర్ యాష్కిన్ లేజర్ బీమ్ ఫింగర్స్‌తో కణాలు, అణువులు, వైరస్‌ను ఆకర్షించే "ఆప్టికల్స్ ట్వీజర్స్‌"ని కనిపెట్టారు. ఆర్థర్ యాష్కిన్ 1.01 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. ఇది మొత్తం ప్రైజ్ మనీలో సగం. మిగతా సగాన్ని ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మౌరౌ, కెనెడాకు చెందిన డొన్నా స్ట్రిక్‌ల్యాండ్ పంచుకున్నారు. స్ట్రిక్‌ల్యాండ్ ఫిజిక్స్ నోబుల్ గెల్చుకున్న మూడో మహిళ కావడం విశేషం. ఆమె గెరార్డ్ మౌరౌతో కలిసి అత్యంత చిన్నవి, తీవ్కమైన లేజర్ పల్సెస్‌ని సృష్టించారు. ఈ టెక్నిక్‌ను కంటి సర్జరీ కోసం ఉపయోగిస్తారు.

సోమవారం జపాన్‌కు చెందిన టసుకు హోంజో, అమెరికాకు చెందిన జేమ్స్ అల్లిసన్‌కు నోబెల్ మెడిసిన్ ప్రైజ్ ప్రకటించారు. బుధవారం కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 8న ఎకనమిక్స్ ప్రైజ్‌లు ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

మెసేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసే మొబైల్ కీబోర్డ్!

సైబర్ క్రైమ్‌ నుంచి కాపాడే ఇన్సూరెన్స్‌ పాలసీలివే!

అక్టోబర్ 11న నోకియా 7.1 ప్లస్ లాంఛింగ్!

Photos: టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

First published:

Tags: Nobel Prize

ఉత్తమ కథలు