నోబెల్ బహుమతుల ప్రకటన...వైద్య రంగంలో ముగ్గురిని వరించిన అత్యున్నత పురస్కారం...

హైపోక్సియాపై పరిశోధన చేసిన విలియం జి కెలెన్, సర్ పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజాలకు నోబెల్ ఇచ్చినట్లు కమిటీ ప్రకటించింది. ఆక్సిజన్‌ను జీవ కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై వీరు పరిశోధన చేశారు.

news18-telugu
Updated: October 7, 2019, 10:58 PM IST
నోబెల్ బహుమతుల ప్రకటన...వైద్య రంగంలో ముగ్గురిని వరించిన అత్యున్నత పురస్కారం...
నోబుల్ పురస్కార గ్రహీతలు (image: Twitter)
  • Share this:
వైద్యరంగంలో చేసిన కృషిపై విలియం జి కెలెన్, సర్ పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజాలకు ఈ ఏడాది నోబెల్ వరించింది. ప్రపంచ శాంతి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్యం, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో అత్యున్నత ప్రతిభా పాటవాలు కనబర్చేవారికి ఈ నోబెల్ బహుమతి ఇస్తారు. ఈ క్రమంలో 2019కు గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. హైపోక్సియాపై పరిశోధన చేసిన విలియం జి కెలెన్, సర్ పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజాలకు నోబెల్ ఇచ్చినట్లు కమిటీ ప్రకటించింది. ఆక్సిజన్‌ను జీవ కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై వీరు పరిశోధన చేశారు. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజు డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో వీరికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. వీరికి నోబెల్ రావడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading