2018 నోబెల్ బహుమతుల ప్రకటన ప్రారంభమైంది. తొలిరోజు వైద్యశాస్త్ర విభాగంలో జపాన్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ లభించించింది. క్యాన్సర్ చికిత్సపై చేసిన పరిశోధనకు గాను హోంజో, జేమ్స్ అలిసన్ (అమెరికా), టసుకు హోంజో (జపాన్)కు నోబెల్ పురస్కారం దక్కిందని నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. క్యాన్సర్ కణాలను నిరోధించేలా శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంపై పరిశోధన చేశారు. వీరి ప్రతిపాదించిన ఇమ్యూన్ చెక్ పాయింట్ సిద్ధాతం క్యాన్సర్ చికిత్సా విధానంలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని నోబెల్ అసెంబ్లీ తెలిపింది.
జేమ్స్ అలిసన్.. టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. హోంజో 34 ఏళ్లుగా క్యోటో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2014లో టాంగ్ బహుమతి సాధించారు. దీన్ని ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తారు. డిసెంబరు 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి సందర్భంగా హోంజో, అలిసన్కు నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. దాంతో పాటు 1.01 మిలియన్ డాలర్ల ( సుమారు 7.36 కోట్ల రూపాయలు) క్యాష్ ప్రైజ్ కూడా అందజేస్తారు.
భౌతిక, రసాయన, వైద్యశాస్త్రాలు, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్ బహుమతి అందిస్తారు. వీటితో పాటు శాంతి బహుమతి కూడా ఇస్తారు. భౌతిక శాస్త్రంలో మంగళవారం, రసాయన శాస్త్రంలో బుధవారం పురస్కారాలు ప్రకటించనున్నారు. ఇక అక్టోబరు 5 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ ప్రైజ్ విజేతలను వెల్లడిస్తారు. #MeToo వ్యవహారం, కొన్ని లైంగిక ఆరోపణల కారణాల నేపథ్యంలో.. సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2018 సాహిత్య నోబెల్ పురస్కారాన్ని 2019 సంవత్సరం పురస్కారంతో కలిపి ఇస్తామని నోబెల్ అసెంబ్లీ ఇది వరకే వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nobel Prize