హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nobel Peace Prize 2020: అన్నం పెడుతున్న సంస్థకే శాంతి బహుమతి

Nobel Peace Prize 2020: అన్నం పెడుతున్న సంస్థకే శాంతి బహుమతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nobel peace prize: కొద్దిరోజులుగా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్ననోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించారు. కోట్లాది మంది ఆకలి తీర్చుతున్న సంస్థకే ఈయేడు నోబెల్ దక్కింది.

  • News18
  • Last Updated :

నోబెల్ బహుమతుల్లో శాంతి బహుమతికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మిగిలిన అవార్డులు వ్యక్తిగతంగా, తమ పరిశోధనల ద్వారా మానవాళి ప్రయోజనాన్ని కాంక్షించి ప్రయోగాలు చేసేవారికి ఇస్తుండగా.. శాంతి బహుమతిని మాత్రం సమాజంలో మార్పు కోసం వ్యక్తులు లేదా సంస్థలు చేస్తున్న కృషికి ఇస్తారు. ఇక ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. అది దక్కాల్సిన సంస్థకే దక్కింది.

ప్రపంచంలో ఆకలి బాధలు అనుభవిస్తూ.. తినడానికి తిండి లేని వారి కడుపు నింపుతున్న ప్రపంచ ఆహార కార్యక్రమాని (డబ్ల్యుూఎఫ్ పీ) కి 2020 కి గాను నోబెల్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆకలి తీర్చడానికి ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు గాను డబ్ల్యుూఎఫ్ పీని నోబెల్ తో సత్కరించారు. యుద్ధ ప్రాంతాల్లో, కల్లోలిత, సంక్షోభ ప్రాంతాలలో ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మందికి ఈ సంస్థ అన్నం పెడుతున్నది. కల్లోలిత ప్రాంతాల్లో శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు ఈ సంస్థకు నోబెల్ కమిటీ చైర్ ఉమెన్.. బెరిట్ రీస్ అండర్సన్ డబ్ల్యుూఎఫ్ పీకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 211 మంది వ్యక్తులు, 107 సంస్థలు పోటీపడ్డాయి. కొంతకాలం క్రితం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోబెల్ శాంతి ఎవరికి వరిస్తుందా అనేదానిపై ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇదిలాఉండగా.. గతేడాదిలో ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. వారి కడుపులు నింపేందుకు డబ్ల్యుూఎఫ్ పీ తీవ్రంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే 88 దేశాల్లో 10 కోట్ల మంది దాకా అన్నం పెట్టింది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు, మధ్యాసియాలో అంతర్యుద్ధాలతో అల్లకల్లోలమవుతున్న దేశాల్లో ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో డబ్ల్యుూఎఫ్ పీ ది ముఖ్యపాత్ర.

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే ఈ సంస్థ.. ప్రపంచంలో అందరికీ ఆహార భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేయబడింది. 1961 లో ఏర్పాటైన దీని ప్రధాన కార్యాలయం ఇటలీ లోని రోమ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 83 దేశాల్లో 9 కోట్ల మందికి పైగా కడుపు నింపుతున్నది.

First published:

Tags: Nobel Peace Prize, Nobel Prize, UNO

ఉత్తమ కథలు