No trust vote stalled in pak national assembly : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఇవాళ ఓటింగ్ జరగాల్సి ఉన్న సమయంలో పాక్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరగకుండా నిలిచిపోయింది. అవిశ్వాస తీర్మానం విదేశీ కుట్రలో భాగమని పేర్కొంటూ స్పీకర్..పార్లమెంట్(PAKISTAN NATIONAL ASSEMBLY)సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అవిశ్వాస తీర్మానం రద్దు అయిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి నేను సలహా ఇస్తున్నాను అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. 90 రోజుల్లోనే ఎన్నికలు జరుగుతాయని ఇమ్రాన్ ప్రభుత్వం తెలిపింది. ఇక,పాక్ లో ఆపధ్దర్మ ప్రభుత్వానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా,తాజా రాజ కీయ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిశారు.
కాగా,గతంలో రెండు సార్లు పాకిస్తాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెనర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకాత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు ప్రదేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరగకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ సేఫ్ అయ్యారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని విపక్ష నాయకుడు చెప్పారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రస్తుత ఛైర్మన్,విపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.."ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు అనుమతించలేదు. ఉమ్మడి ప్రతిపక్షం పార్లమెంటును విడిచిపెట్టడం లేదు. మా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రక్షించడానికి, సమర్థించడానికి, రక్షించడానికి అన్ని సంస్థలు ఆందోళన చేపట్టాలని మేము పిలుపునిచ్చాము. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించాలని కోరుతాము"అని అన్నారు.
ALSO READ Floods : బ్రెజిల్ లో ఆకస్మిక వరదలు..7గురు చిన్నారులు సహా 14మంది మృతి
కాగా,పాకిస్తాన్లో తన ప్రభుత్వం పడిపోవాలని కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ రెండు రోజుల క్రితం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో తాను మాస్కోలో పర్యటించడం నచ్చక తనపై ఓ దేశం కుట్రలు పన్నిందని అన్నారు. తన ప్రసంగంలో పరోక్షంగా అమెరికాపై ఆయన పలు ఆరోపణలు చేశారు. అమెరికా గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ... ఓ దేశం నుంచి మెసేజ్ వచ్చిందని.. ఇమ్రాన్‌ను తొలగించాలని లేదంటే... ఆ తర్వాత వచ్చే పరిణామాల్ని పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. నిజానికి అమెరికా తనపై కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఓ రహస్య లేఖను ప్రస్తావిస్తూ ఆరోపించారు. పాకిస్థానీ దౌత్యవేత్త ఒకరు విదేశీ అధికారికి ఈ లేఖ రాశారని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ లేఖను అమెరికాలోని పాక్ మాజీ రాయబారి అసద్ మజిద్ ఖాన్ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపారు.. అసద్ మజిద్ ఖాన్‌తో ఓ శక్తిమంతమైన దేశానికి చెందిన సీనియర్ అధికారికి మధ్య జరిగిన సంభాషణలో భాగమే ఈ లేఖ అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan