హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghan మహిళల ప్రయాణాలపై కఠిన ఆంక్షలు.. మగ తోడు లేకుండా పోవద్దు: Taliban హుకుం

Afghan మహిళల ప్రయాణాలపై కఠిన ఆంక్షలు.. మగ తోడు లేకుండా పోవద్దు: Taliban హుకుం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే ఆడపిల్లల స్కూల్, కాలేజీ చదువులపై ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళల ప్రయాణాలనూ దాదాపు నిషేధించినంత పని చేసింది. మహిళలెవరూ ఒంటరిగా లేదా గుంపులుగా ట్యాక్సీలు, ఇతర వాహనాల్లో ప్రయాణించొద్దని హుకుం జారీ చేశారు తాలిబన్ పాలకులు.

ఇంకా చదవండి ...

మేము మారుతున్నాం.. మానవత్వం చూపండి.. అంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటోన్న తాలిబన్లు వాస్తవానికి ఇంకాస్త కఠినంగా తయారవుతున్నారు. అఫ్గానిస్థాన్ ను కైవసం చేకున్న తాలిబన్లు అందరూ ఊహించినట్లుగానే మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే ఆడపిల్లల స్కూల్, కాలేజీ చదువులపై ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మహిళల ప్రయాణాలనూ దాదాపు నిషేధించినంత పని చేసింది. మహిళలెవరూ ఒంటరిగా లేదా గుంపులుగా ట్యాక్సీలు, ఇతర వాహనాల్లో ప్రయాణించొద్దని హుకుం జారీ చేశారు తాలిబన్ పాలకులు.

ఒంటరి మహిళలు లేదా అందరూ మహిళలే ప్రయాణించే వాహనాలను ఇకపై అనుమతించబోమని, ఆడవాళ్లు ఒకవేళ సుదీర ప్రాంతాలకు ప్రయాణించాలంటే సన్నిహిత పురుష బంధువు తోడుగా ఉంటేనే అనుమతిస్తామని తాలిబన్ అధికారులు ప్రకటించారు. షరియత్ చట్టాల అమలు, అనాచారాల నిరోధం కోసం ఏర్పాటైన మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదివారం ప్రకటన చేసింది.

Desmond Tutu : వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు టుటూ ఇకలేరు.. SA ఆర్చిబిషప్ మృతిపై pm modi విచారంఅమెరికా సేనలు అఫ్గాన్ నుంచి వైదొలగిన తర్వాత ఘని సర్కారును కూలదోసి ఆగస్టు 15 నుంచి తాలిబన్లు రాజ్యం చేస్తుండటం తెలిసిందే. తాలిబన్లు వస్తూనే ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే మహిళల్లో చాలా మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే చాలా మంది బాలికలను చదువుకు దూరం చేశారు. ఇప్పుడేమో వారి ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు.

rtc bus : కదులుతోన్న ఆర్టీసీ బస్సులో మంటలు.. నడిరోడ్డుపైనే కాలి బూడిదైంది.. videoసదాచారాన్ని ప్రోత్సహించడం, అనాచారాలను నిరోధించడం కోసం ఏర్పాటైన మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సడెక్ అకిఫ్ ముహజిర్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సన్నిహిత కుటుంబ సభ్యుడు తోడుగా లేనట్లయితే, మహిళలను రోడ్డు మార్గంలో 45 మైళ్ళు (72 కిలోమీటర్లు) కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుమతించరాదని ట్రావెల్ ఏజెన్సీలకు చెప్పారు. వాహనాలలో సంగీతాన్ని వినిపించరాదని కూడా చెప్పారు.

Ghulam Nabi Azad కాంగ్రెస్‌కు రాజీనామా.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కుండబద్దలుఇటీవల ఈ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో, మహిళలు నటించే నాటకాలు, సోప్ ఒపేరాలను ప్రసారం చేయరాదని టెలివిజన్ చానళ్ళను ఆదేశించారు. టీవీ జర్నలిస్టులు ప్రజెంటేషన్ ఇచ్చేటపుడు హెడ్‌స్కార్ఫ్ ధరించాలని ఆదేశించారు. మరోవైపు తాలిబన్లు తాము మితవాద ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

First published:

Tags: Afghanistan, Taliban, Travel ban, Women

ఉత్తమ కథలు