No sex: అక్కడ శృంగారానికి నో చెబుతున్న మహిళలు.. ఎక్కడ... ఎందుకో తెలుసా..?

నో సెక్స్

Sex Strike: నిరసన తెలపడానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు.. కానీ అక్కడ మహిళలు ఎవ్వరూ ఊహించని నిర్ణయ తీసుకుని భర్తలకు షాక్ ఇచ్చారు. ఇకపై సెక్సె లో పాల్గొనకూడదని నిర్ణయించారు.

 • Share this:
  Sex Strike in Texas: సాధారణంగా ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకించే వారు నిరసలు తెలుపుతుంటారు. అయితే ఇటీవల చాలా వినూత్న నిరసనలు మనం చూస్తూనే ఉన్నాం.. కానీ ఇలాంటి సమ్మె (strike) గురించి ఎప్పుడూ విని ఉండరు. ఎందుకంటే అక్కడి మహిళలు ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయంపై అసమ్మతి తెలియ చేయడానికి అని భర్తలను పస్తులు పెట్టేందుకు రెడీ అయ్యారు. టెక్సాస్‌‌  (Taxes)మహిళలు ఇచ్చిన ఈ సరికొత్త పిలుపు ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల టెక్సాస్ ప్రభుత్వం.. కొత్త అబార్షన్  చట్టాన్ని (abortion law) తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మరీ నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి, గాయని బెట్టే మిడ్లర్ (Bette Midler) మహిళాలోకానికి ఇచ్చిన పిలుపు చర్చనీయమవుతోంది.

  టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బెట్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఊహించిని పిులపు ఇచ్చారు. ఇకపై అక్కడి మహిళలంతా సెక్స్ సమ్మె చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు మహిళలు పురుషులతో సెక్స్ చేయరాదని ప్రకటించింది. అందుకు అందరూ ఆంగీకరం తెలపడంతో ఇకపై టెక్సాస్ లో సెక్స్ కు మహిళలు దూరంగా ఉండనున్నారు..

  గర్భం దాల్చాలా, వద్దా అనే విషయంపై సొంత నిర్ణయం తీసుకొనే హక్కు మహిళలకు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అబర్షన్ చేయించుకోకుండా.. ఇష్టం లేకున్నా పిల్లలని కనాలని చెప్పడం అన్యాయమని ఆమె పేర్కొంది. ట్వీట్టర్ వేదికగా ఆమె తన ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు సెక్స్ సమ్మెలో పాల్గోవాలని చెప్పింది.

  ఇదీ చదవండి : మనిషిలా మిమిక్రీ చేసే పక్షిని ఎప్పుడైనా చూశారా..? కావాలంటే ఈ వీడియో చూడండి!

  గర్భం దాల్చిన ఆరు వారాల వరకు మహిళలకు తాము ప్రెగ్నెంట్ అనే విషయం చాలామందికి తెలిసే అవకాశం ఉండదని.. కానీ ప్రభుత్వం ఆ గడువును కూడా కుదిస్తూ నిషేదం విధించడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ గర్భం గురించి మహిళలు సొంత నిర్ణయం తీసుకొనే హక్కును ప్రభుత్వం కల్పించే వరకు ఎవరూ పురుషులతో లైంగిక సంబంధాన్ని తిరస్కరించాలని ఆమె కోరారు.

  ఇదీ చదవండి : 5 కోట్ల పోస్టు కార్డులు.. 20 రోజుల వేడుకలు.. ప్రధాని బర్త్ డే స్పెషల్

  బెట్టే మిడ్లర్ ఇచ్చిన పిలుపుకు మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. తప్పకుండా సెక్స్ సమ్మె చేపడతామని అక్కడి మహిళలు ముందుకు వస్తున్నారు. బెట్టే పిలుపును అక్కడి మహిళలు సీరియస్ తీసుకున్నా.. ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాబోదని తెలుస్తోంది.
  టెక్సాస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త అబార్షన్ చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలో మహిళాభుద్యయ సంఘాలు తమ నిరసలు వ్యక్తం చేస్తున్నాయి. వారికి మద్దతు తెలుపుతూ బెట్టీ ఈ ట్వీట్ చేశారు. టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే, కోర్టు వాటిని తిరస్కరించడంతో చట్టం అమల్లోకి వచ్చింది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన అబార్షన్ హక్కుల తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉందని పలువురు వాదిస్తున్నారు.

  ఇదీ చదవండి : భయపెట్టే దోమలు గురించి విన్నాం.. కానీ ఈ అందమైన దోమ గురించి మీకు తెలుసా..?

  టెక్సాస్‌లో అమలైన ఈ కొత్త అబార్షన్ చట్టం ప్రకారం.. ఇకపై ఆరువారాల గర్భంతో అబార్షన్ చేయించకోడానికి సిద్ధమయ్యే మహిళలకు ఇబ్బంది కానుంది. ఇదివరకు ఆరు వారాల గర్భం తర్వాత పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఉండేది. అయితే.. ఈ సారి పిండాన్ని తొలగించే ముందు వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. ఒక వేళ వారి గర్భంలోని పిండంలో హృదయ స్పందన మొదలైతే.. అబార్షన్ చేయడానికి చట్టం అంగీకరించదు. పిండంలో గుండె ఏర్పడితే.. అది ప్రాణం ఉన్న శిశువుగా పరిగణిస్తారు. అందుకే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కొంతమంది మహిళలకు ఆరు వారాలు గడిచేవరకు తాము గర్భవతి అని తెలియదు. అలాంటి మహిళల పరిస్థితి ఏమిటని మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అయితే అత్యాచారం, అక్రమ సంబంధాల వల్ల కలిగే గర్భాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని పేర్కోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేవలం హెల్త్ ఎమర్జన్సీకి మాత్రమే ఈ చట్టం నుంచి ఉపశమనం కల్పిస్తారట.
  Published by:Nagesh Paina
  First published: