హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

కర్తార్‌పూర్ యాత్రికులకు పాకిస్థాన్ ఆహ్వానం... ఇమ్రాన్‌ఖాన్ ఏమన్నారంటే...

కర్తార్‌పూర్ యాత్రికులకు పాకిస్థాన్ ఆహ్వానం... ఇమ్రాన్‌ఖాన్ ఏమన్నారంటే...

ఇమ్రాన్ ఖాన్ (File)

ఇమ్రాన్ ఖాన్ (File)

Kartarpur Corridor : పాకిస్థాన్‌తో భారత్‌కు సరైన సఖ్యత లేని సమయంలో... ఆ దేశంలోని కర్తార్‌పూర్‌ వెళ్లేందుకు మాత్రం రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఉంది. భారత్ నుంచీ వచ్చే యాత్రికులకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సందేశం పంపారు.

Kartarpur Corridor : ఇండియాలోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉండే గురుద్వారా వరకు వెళ్లేందుకు భారత్, పాకిస్తాన్ మధ్య డీల్ కుదిరిన విషయం మనకు తెలుసు. ఇండియా నుంచీ వెళ్లేవారికి వీసాతో పనిలేకుండా గురుద్వారాకు అనుమతిస్తారు. ఐతే... కర్తార్‌పూర్‌ సాహిబ్‌ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఈ యాత్ర విషయంలో పాకిస్థాన్‌ రూ.1400 ($20) సర్వీస్ ఛార్జి తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి తాజాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. ఇండియా నుంచీ కర్తార్ పూర్ వచ్చే సిక్కులకు తాను రెండు కండీషన్లు పెడుతున్నానని అన్నారు. 1. పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఏదైనా విలువైన ఐడీ కార్డ్ ఉండాలి. 2. వాళ్లు పది రోజులు ముందుగా రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. యాత్ర ప్రారంభ రోజున సర్వీస్ ఛార్జి ఉండదు. గురూజీ 550వ జన్మదినం రోజున యాత్ర ప్రారంభోత్సవం జరగనుంది.

సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో 18 ఏళ్లు గడిపారు. రావి నదీ తీరాన గురద్వార కర్తార్‌పూర్ ఉంది. విదేశాల్లో ఉండే ఎన్నారైలు కూడా గురుద్వార దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చని హోంశాఖ తెలిపింది. రోజుకు 5000 మంది భక్తులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శిస్తారని అంచనా. ఏడాది మొత్తం యాత్ర కొనసాగించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. వారం మొత్తం యాత్రకు అనుమతి ఉంది. సెలవు దినాలేవీ లేవు.

కర్తార్‌పూర్ యాత్ర ఎలా చెయ్యాలి? :

* కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో పేరు, వివరాలు రిజిస్టర్ చేయించుకోవాలి.

* రిజిస్టర్ కోసం https://prakashpurb550.mha.gov.in/kpr సైట్‌లోకి వెళ్లాలి.

* https://prakashpurb550.mha.gov.in/kpr/basicDetailsa లో వివరాలు ఇవ్వాలి.

* యాత్రకు వెళ్లే 4 రోజుల ముందే బుక్ చేసుకుంటే యాత్ర సాఫీగా సాగుతుంది.

* భక్తులను కర్తార్‌పూర్ సాహిబ్‌కే అనుమతిస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్లనివ్వరు.

* ఈ యాత్రకు వెళ్లే భక్తులు మాగ్జిమం రూ.11000 మాత్రమే తీసుకెళ్లాలని రూల్ ఉంది.

* ఒక్కో యాత్రికుడు/యాత్రికురాలు... 7 కేజీలకు మించి లగేజీని తీసుకెళ్లకూడదు.

* తాగే నీరు కూడా లగేజీలో భాగమే.

* యాత్రలో ఎక్కడా స్మోకింగ్ చెయ్యకూడదు.

* యాత్రలో ఫొటోలు, వీడియోలు తియ్యడానికి అనుమతి లేదు.

* యాత్ర కోసం పాలిథిన్ కవర్లు తీసుకెళ్లకూడదు. నార సంచులు, గుడ్డ సంచులు తీసుకెళ్లొచ్చు.

* ఉదయం కర్తార్‌పూర్‌కు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేలా ప్లాన్ వేసుకోవాలి.


Pujita Ponnada : క్యూట్‌గా కవ్విస్తున్న రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ


ఇవి కూడా చదవండి :

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏర్పాటయ్యేదెప్పుడు?

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియలపై సస్పెన్స్... నేడు కరీంనగర్ బంద్?

పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న టీడీపీ... వైసీపీ టార్గెట్‌గా ప్లాన్ C అమలు

నేడు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం... ఏంటి దాని ప్రత్యేకత?

జగన్ కోర్టుకు వెళ్తారా... లేదా? నేడు తేల్చనున్న సీబీఐ కోర్టు

First published:

Tags: National News, Pakistan

ఉత్తమ కథలు