• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • NO NEED TO WEAR MASKS AT OUTDOORS IF YOU HAVE GOT VACCINATED CDC LATEST ADVISORY TO AMERICAN PEOPLE HSN

America: మాస్కులు ధరించకుండానే ఇకపై బయటకు వెళ్లొచ్చు.. ఒకే ఒక్క కండీషన్ తో అమెరికన్లకు భారీ ఊరట..!

America: మాస్కులు ధరించకుండానే ఇకపై బయటకు వెళ్లొచ్చు.. ఒకే ఒక్క కండీషన్ తో అమెరికన్లకు భారీ ఊరట..!

ప్రతీకాత్మక చిత్రం

మాస్కుల గోల నుంచి అమెరికన్లకు భారీ ఊరట లభించింది. మాస్కులు లేకుండానే బయట తిరిగేందుకు అగ్రరాజ్య పౌరులకు వెసులుబాటు కల్పించింది. అయితే ఒకే ఒక్క కండీషన్ ను మాత్రం విధించింది.

  • Share this:
    ’అబ్బబ్బబ్బా.. ఈ మాస్కుల గోలేంట్రా బాబు. ఇంటి నుంచి అడుగు బయటకు పెడితే చాలు మాస్కు పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ కరోనా వల్ల ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం. ఒకటికి రెండు మాస్కులు ధరించాలంటూ ‘డబుల్ మాస్క్ థియరీ‘ని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ కరోనా ఎప్పుడు పోతుందో? ఎప్పటికి మాకు ఈ మాస్కుల గోల తప్పుతుందో‘ అని ఈ తరం కుర్రాళ్లు చాలా మంది మనసులోనే అనుకుంటూ ఉంటుంటారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ తారస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారత్ లో మాస్కుల గోల ఇప్పట్లో తప్పేట్టు లేదు. కానీ అమెరికాలో మాత్రం మాస్కుల నుంచి జనాలకు రిలీఫ్ దొరకబోతోంది. అదేంటీ, అక్కడ కూడా కేసుల సంఖ్య తక్కువేమీ కాదు కదా అనే కదా మీ డౌటు.

    కరోనా మొదటి దశలో అత్యంత ప్రభావితం చెందిన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికాయే. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి కరోనా కూడా ఓ కారణమే. రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా తీవ్రత తగ్గినా, మరీ పూర్తిగా నిర్లక్ష్యం వహించలేని పరిస్థితి. రోజూ దాదాపుగా 50 వేల నుంచి లక్ష లోపు కరోనా కేసులు అగ్రరాజ్యంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీలయినంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ను వేయించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. తాజాగా అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

    అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్న వాళ్లు ఇకపై మాస్కులు లేకుండానే బయట తిరగొచ్చని సీడీసీ తేల్చిచెప్పింది. అదే సమయంలో ఒక డోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్న వాళ్లు కూడా మాస్కులు లేకుండా బయట తిరిగేందుకు వెసులుబాటును కల్పించింది. వ్యాక్సిన్ ను వేసుకున్న వాళ్లు ఒంటరిగా కానీ, కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి కానీ బయట మాస్కులేకుండానే షికార్లకు వెళ్లొచ్చట. వ్యాక్సిన్లను వేయించుకోని వారు మాత్రం తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని సూచించింది. భారీ బహిరంగ సభలు, జనసమ్మూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు కూడా మాస్కులు ధరించాల్సిందేనని సూచించింది. అదే సమయంలో వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు ధరిస్తేనే అన్ని విధాలుగా మేలని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు