హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Twitter Character Limit: ట్విట్టర్‌లో ఇక 280-క్యారెక్టర్ లిమిట్ ఉండదా..? ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి..?

Twitter Character Limit: ట్విట్టర్‌లో ఇక 280-క్యారెక్టర్ లిమిట్ ఉండదా..? ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్ (Elon Musk) రీసెంట్‌గా పాపులర్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన ట్విట్టర్‌లో క్యారెక్టర్ లిమిట్‌ (Character Limit) ఎత్తేస్తానని కన్ఫర్మ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter Character Limit : టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్ (Elon Musk) రీసెంట్‌గా పాపులర్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన ట్విట్టర్‌లో క్యారెక్టర్ లిమిట్‌ (Character Limit) ఎత్తేస్తానని కన్ఫర్మ్ చేశారు. ఇంకా దీనిలో ఎన్నో మార్పులు చేయనున్నారు. ఇప్పటికే ఈ సంస్థలోని కీలకమైన ఉద్యోగులను మస్క్ తొలగించారు. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌లో 280 అక్షరాల లిమిట్‌ను కూడా తొలగిస్తానని మస్క్ ఆదివారం ధ్రువీకరించారు. ఈ మార్పును తీసుకొస్తే యూజర్లకి ఏవైనా ప్రయోజనాలు చేకూరుతాయా? లేదంటే ఇదొక పెద్ద తప్పు అవుతుందా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం యూజర్లు 280 లోపు అక్షరాలతో మాత్రమే ట్వీట్ చేయగలుగుతున్నారు. అంతకుమించి అక్షరాలను ఒక ట్వీట్‌లో టైప్ చేస్తే.. అది పోస్ట్ కాదు. దీనివల్ల ఏదైనా పెద్ద విషయాన్ని ట్వీట్ చేయాలనుకుంటే ట్వీట్ థ్రెడ్ క్రియేట్ చేయాల్సి వస్తోంది. కాగా మస్క్ చేతిలోకి ట్విట్టర్ రాగా.. ఇప్పటికైనా ఈ క్యారెక్టర్ లిమిట్ మారుతుందా అని కొందరు యూజర్లు ఊహగానాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక యూజర్.. "ట్విట్టర్‌లో క్యారెక్టర్ లిమిట్ తొలగిస్తారా లేదా కనీసం ఆ లిమిట్ అయినా పెంచుతారా?" అని క్వశ్చన్ వేశారు. దానికి రిప్లై ఇస్తూ "కచ్చితంగా" అని మస్క్ కన్ఫర్మ్ చేశారు.

మస్క్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో లాంగ్-ఫామ్‌ ట్వీట్‌లు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిజానికి ఈ మార్పు ఎప్పుడో రావాల్సిందని అన్నారు. ఓ ట్వీట్ థ్రెడ్‌కు రిప్లై ఇస్తూ.. ట్విట్టర్ లాంగ్-ఫామ్‌ ట్వీట్స్‌ తీసుకురావడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ లిమిట్ కచ్చితంగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ట్విట్టర్ నవంబర్ 2017లో వినియోగదారులందరికీ 280 క్యారెక్టర్ లిమిట్ తీసుకొచ్చింది. 2017 సెప్టెంబరు నెలలో సెలెక్టెడ్ యూజర్లకు ఈ సదుపాయాన్ని మొదటిసారి పరిచయం చేసింది. అంతకుముందు ట్వీట్‌లో 140 అక్షరాలు కంటే ఎక్కువగా క్యారెక్టర్స్ రాయడానికి ట్విట్టర్ వీలు కల్పించలేదు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ఇదే..ఎన్ని సీట్లు,పొడవు ఎంతో తెలుసా

పెద్దగా ట్వీట్ రాసేటట్లు ఉంటే నష్టమే

ఇతర సోషల్ మీడియా సైట్స్‌తో పోలిస్తే ట్విట్టర్ చాలా ప్రత్యేకం. సోది లేకుండా కొన్ని పదాలలోనే ముఖ్యమైన విషయం మాత్రమే చెప్పేలా ట్వీట్ క్యారెక్టర్ లిమిట్‌ను ట్విట్టర్ సెట్ చేసింది. ట్విట్టర్ పాపులర్ కావడానికి ఒక రకంగా చిన్న ట్వీట్ పోస్ట్‌లే కారణమని చెప్పొచ్చు. అదే ఒక ట్వీట్ చాలా పెద్దగా రాసేలా ఉంటే వాటిని చదివే ఇంట్రస్ట్ యూజర్లకు ఉండకపోవచ్చు. దీనివల్ల ట్వీట్స్‌ చదవాలనే ఆసక్తి బాగా తగ్గుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి మస్క్ క్యారెక్టర్ లిమిట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

పూర్తిగా మారిపోనున్న ట్విట్టర్

ఇంతకుముందు, మస్క్ ఎడిట్ బటన్‌ను డిమాండ్ చేశారు. ట్విట్టర్.కామ్‌ని విజిట్ చేసే లాగవుట్ యూజర్లు ట్రెండింగ్ ట్వీట్‌లు, వార్తా కథనాలను చూపించే ఎక్స్‌ప్లోర్‌ పేజీకి చూపించాలని కూడా మస్క్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మరెన్నో మార్పులను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి ట్విట్టర్‌ త్వరలోనే తన ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చుకోబోతోందని తెలుస్తోంది.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు