హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Ukraine Girl : పుట్టినరోజు నాడే..సొంత ఊరు వదిలి శరణార్థిగా పొరుగుదేశానికి 4 ఏళ్ల చిన్నారి

Ukraine Girl : పుట్టినరోజు నాడే..సొంత ఊరు వదిలి శరణార్థిగా పొరుగుదేశానికి 4 ఏళ్ల చిన్నారి

Russia-Ukraine War : క్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను రష్యా మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (UNHCR)తెలిపింది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలండ్ కు వెళ్లారు.

ఇంకా చదవండి ...

Birthday girl forced to flee Ukraine :  ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రజలు ఆ దేశాన్ని వీడుతున్నారు. ఉక్రెయిన్‌ కు చెందిన ల‌క్షలాది మంది ప‌లు దేశాల‌కు శ‌ర‌ణార్ధులుగా త‌ర‌లి వెళ్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఇర్పిన్ నగరానికి చెందిన కొందరు చివరి బ్యాచ్‌గా అక్కడి నుంచి బస్సుల్లో వెళ్లారు. అయితే అదే రోజున ఆ బస్సులో ఉన్న నాలుగేళ్ల పాప డారియా నాలుగో ఏట ప్రవేశించింది.

సొంత ఊరిని వదిలి వెళ్లాల్సిన రోజునే చిన్నారి డారియా పుట్టిన రోజు. దీంతో సొంత ఊరిని వీడుతున్న బస్సులోనే క్యాండిల్‌, కేక్‌ లేకుండా డారియా పుట్టిన రోజును జరుపుకోవాల్సి వచ్చింది. నిజానికి తన కుమార్తె నాలుగో పుట్టిన రోజును ఎంతో వేడుకగా చేయాలని భావించినట్లు ఆ పాప తల్లి సుసన్నా సోపెల్నికోవా తెలిపారు. అయితే రష్యా దాడుల వల్ల తమ ఇల్లు ధ్వంసమైందని ఆమె చెప్పారు. దాడులు మరింతగా పెరుగుతుండటంతో ప్రాణాలను కాపాడుకునేందుకు తమ కుమార్తె పుట్టిన రోజు నాడే ఇర్పిన్‌ ను వీడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "రష్యన్ క్షిపణి ఇర్పిన్‌లోని మా ఇంటిని ధ్వంసం చేయడంతో మేము మా ఇంటిని వదిలి పెట్టాల్సి వచ్చింది. ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఇంటిపై కప్పు కూలిపోయింది. కరెంట్ లేదు, నీరు లేదు, గ్యాస్ లేదు" అని సుసన్నా చెప్పారు.

ALSO READ Joe Biden : పుతిన్ ఓ కసాయి..ఉక్రెయిన్ శరణార్థులని గుండెలకు హత్తుకుని ఓదార్చిన బైడెన్

ఉక్రెయిన్ నగరాల్లో రష్యా బలగాలు దాడులను మరింత పెంచాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఎంతోమంది అమాయక పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమను తాము కాపాడుకోవడానికి చాలామంది దేశం నుంచి పారిపోతున్నారు. వారితోపాటు పిల్లలను కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను రష్యా మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను వీడి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్లి శరణార్థులుగా మారిన వారి సంఖ్య కోటికి చేరిందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (UNHCR)తెలిపింది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైన పోలండ్ కు వెళ్లారు. ప్రస్తుతం పోలాండ్‌ లో దాదాపు 12-13 లక్షల మంది శరణార్థులు ఉన్నట్లు వార్సా యూనివర్సిటీలో మైగ్రేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్‌ మాసీజ్ డస్జ్‌జిక్ అంచనా వేశారు.

First published:

Tags: Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు