నీరవ్ మోదీకి మరో బిగ్ షాక్... స్విస్ బ్యాంక్ అకౌంట్లు సీజ్

నీరవ్ మోదీకు సంబంధం ఉన్న నాలుగు స్వీస్ బ్యాంక్ అకౌంట్లను అక్కడి అధికారులు సీజ్ చేశారు.

news18-telugu
Updated: June 27, 2019, 12:42 PM IST
నీరవ్ మోదీకి మరో బిగ్ షాక్... స్విస్ బ్యాంక్ అకౌంట్లు సీజ్
నీరవ్ మోదీ (Image : Twitter)
  • Share this:
మన దేశంలో బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆయన చెల్లెలికి చెందిన నాలుగు స్విస్ బ్యాంక్ అకౌంట్లను స్విట్జర్లాంట్ అధికారులు సీజ్ చేశారు. ఇందులో ఆరు మిలియన్ డాలర్లతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ. 14 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన నీరవ్ మోదీ... కొన్ని నెలలుగా లండన్‌లో తలదాచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే యూకే హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మార్చి 19న ఇంగ్లాండ్‌లో ఓ కేసుకు సంబంధించి నీరవ్ మోదీ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి జైలులో ఉన్న ఆయన... బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. యూకే చట్టాల ప్రకారం నీరవ్ మోదీ ప్రతీ నాలుగువారాలకోసారి కోర్టు ముందు హాజరయ్యే అవకాశం ఉంది.


First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు