ఇండియా నుంచీ లండన్ పారిపోయిన బిలియనీర్ నీరవ్ మోదీ... లండన్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. ఏమాత్రం భయం లేకుండా గడుపుతున్నాడు. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ రూ.13వేల కోట్లు అప్పు చెల్లించాలి. అ డబ్బు చెల్లించకుండా లండన్ పారిపోయాడు. ఇండియా వస్తే, కచ్చితంగా అరెస్టు చేస్తారని తెలుసు. అందుకే అక్కడే ఉండి... డైమండ్స్ బిజినెస్ మొదలుపెట్టాడు. బ్రిటన్‌కు చెందిన ద టెలిగ్రాఫ్ పేపర్ రిపోర్టర్... నీరవ్ మోదీని గుర్తు పట్టాడు. వెంటనే వరుస ప్రశ్నలు వేశాడు. దొంగలా జారుకున్న నీరవ్ మోదీ... ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. నో కామెంట్ అంటూ ప్రతి ప్రశ్నకూ పాస్ చెప్పాడు.
Exclusive: Telegraph journalists tracked down Nirav Modi, the billionaire diamond tycoon who is a suspect for the biggest banking fraud in India's historyhttps://t.co/PpsjGeFEsypic.twitter.com/v3dN5NotzQ
నీరవ్ మోదీ ఎంత దర్జాగా ఉన్నాడంటే... అతను వేసుకున్న జాకెట్ చాలా కాస్ట్లీ. లండన్‌లోని ఓ బిజీ స్ట్రీట్‌లో అలా వెళ్తూ కనిపించాడు. లండన్‌లోని వెస్ట్ఎండ్లో ఉండే సోహో ఏరియాలో నీరవ్ కొత్తగా డైమండ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు ద టెలిగ్రాఫ్ తెలిపింది.
నీరవ్ మోదీ (Image : Twitter)
లండన్‌లో ఉండేందుకు అప్లై చేసుకున్నారా అని అడిగితే కూడా... అమాయకపు ఫేస్ పెట్టి తప్పించుకున్నాడు నీరవ్ మోదీ.
నీరవ్ మోదీ భవనం
మరోవైపు నేరగాడు నీరవ్ మోదీ ఇష్టంగా కట్టుకున్న మహారాష్ట్రలోని అలీబాగ్‌లోని బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు నేలమట్టం చేశారు. సాధారణంగా బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల్ని, కట్టడాల్ని అధికారులు తొలగిస్తుంటారు. కానీ నీరవ్ మోదీ బంగ్లా కూల్చేందుకు మాత్రం అధికారులు 100 డైనమైట్లు వాడి పడగొట్టారు. భవనానికి రంధ్రాలు చేసి డైనమైట్ అమర్చి పేల్చేశారు. రిమోట్ కంట్రోల్ సాయంతో దీన్ని ఆపరేట్ చేశారు. నీరవ్ మోదీ ఆ బంగ్లాను 33 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించాడు. దాని విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే తీరప్రాంత రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాను నిర్మించడంతో ఈ అత్యంత విలాసవంతమైన బంగ్లాను అధికారులు పేల్చారు. ఒక్క బంగ్లానే కాదు... బంగ్లా బయట ఉన్న తోటను కూడా ధ్వంసం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.