పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.13,000 కోట్లకు పైగా అప్పు పెట్టి... విదేశాలకు చెక్కేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసినట్లు ఇప్పుడు తెలిసింది. యూరప్ ఖండానికి చెందని వాళ్లు బ్రిటన్ ప్రభుత్వ కంపెనీల్లో బాండ్లు, షేర్లలో 2 మిలియన్ పౌండ్లు (రూ.18కోట్లకు పైగా) పెట్టుబడిగా పెడితే వారికి గోల్డెన్ ఇన్వెస్టర్ వీసా ఇస్తారు. బ్రిటన్ ప్రభుత్వం నీరవ్ మోదీకి ఇండియన్ పాస్ పోర్టుపై గోల్డెన్ వీసా జారీ చేసింది. అందువల్ల ఆయన బ్రిటన్‌లో శాశ్వతంగా ఉండేందుకు అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి అర్హత పొందినట్లైంది. యూకేలో గోల్డెన్ వీసా పొందిన వాళ్లు ఆ దేశంలో పనిచేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు. ఇలాంటి వీసాతో అక్కడే ఉంటే... ఇండియాకి రాకుండా దొంగలా తిరుగుతున్న ఆర్థిక నేరస్థుడైన మోసగాడు నీరవ్ మోదీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
నీరవ్ మోదీ సెంట్రల్ పాయింట్ లండన్ అపార్టుమెంట్ బ్లాకులో నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లిస్తూ ఉంటున్నాడని సమాచారం. ఆమధ్య న్యూయార్క్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో కొన్నాళ్లు ఉన్నాడని తెలిసింది. గతేడాది నవంబరులో ఇంటర్‌పోల్ నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నీరవ్ మోదీ స్కాట్లాండ్ ప్రొవిడెంట్ హౌస్ కాలేజీ రోడ్డు కేంద్రంగా ఉన్న భవనంలో హోల్ సేల్‌గా డైమండ్లు, నగలు, వాచీలు అమ్ముతున్నట్లు తెలిసింది.
వేషం మార్చి... మోసం చేసి... : నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్... వెస్ట్ ఎండ్‌లోని రూ.60 కోట్ల విలువైన ఫ్లాట్‌లో ఉంటున్నట్లు తెలిసింది. ఈమధ్య బారు మీసాలు, గడ్డం పెంచి... కాస్ట్లీ ఆస్ట్రిచ్ హైడ్ లెదర్ జాకెట్ వేసుకొని... లండన్ వీధిలో కనిపించడంతో కలకలం రేగింది. నీరవ్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీఅయినా బ్రిటన్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.