Home /News /international /

NIRAV MODI BAIL PETITION REJECTED BY LONDON COURT MK

మరో నెలరోజులు నీరవ్ మోదీకి జైల్లో చిప్పకూడే...

నీరవ్ మోదీ (Image : Twitter)

నీరవ్ మోదీ (Image : Twitter)

పీఎన్బీ బ్యాంకు కుంభకోణంలో అరెస్టు అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. రిమాండ్ ఖైదీగా ఉన్న నీరవ్ మోదీ బెయిల్ కోసం పిటిషన్ వేయగా, కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

    వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. రూ 13500 కోట్లు పీఎన్బీ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా ఉన్న నీరవ్ మోదీ ఇప్పటికే లండన్ జైల్లో నిందితుడిగా రిమాండ్ లో ఉండగా, మరో 28 రోజుల పాటు నీరవ్ మోదీ అక్కడే గడపాల్సి ఉంది.  లండన్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణతో నీరవ్ మోదీ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అలాగే అటు యూకే కేంద్ర హోం శాఖతో, భారతీయ అధికారులు తమకు అప్పగించాల్సిందిగా పేర్కొన్నారు. దీనిపై యూకే హోమ్ శాఖ సైతం వడివడిగా చర్యలు తీసుకుంటోంది. మే 24న జరిగే కేసు విచారణలో నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయమై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    ఇదిలా ఉంటే లండన్ లోని నీరవ్ మోదీ భారతీయ అధికారులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ తరపున క్రౌన్ పాసిక్యూషన్ సర్వీస్ బలంగా వాదనలు వినిపించింది. వాదనల్లో ప్రధానంగా నీరవ్ మోదీ వనౌతు దేశానికి చెందిన వీసాను సైతం కొనేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించింది. దీని ఆధారంగానే నీరవ్ మోదీకి ఎట్టిపరిస్థితులలో బెయిల్ ఇవ్వకూడదని వాదించింది. దీనిపై స్పందించిన మేజిస్ట్రేట్ కేసుకు సంబంధించిన పూర్తి హియరింగ్ మే 30 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది.
    First published:

    Tags: Nirav Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు