ఒక విచిత్రం... మెటర్నిటీ వార్డులో 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులైతే..

ఓ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో పనిచేసే 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులు అయ్యారు. అందరూ మరికొన్ని వారాల్లో ప్రసవించబోతున్నారు.

news18-telugu
Updated: March 27, 2019, 4:22 PM IST
ఒక విచిత్రం... మెటర్నిటీ వార్డులో 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులైతే..
ఆస్పత్రి యాజమాన్యం పోస్ట్ చేసిన ఫొటో (Alicia Wilson/Maine Medical Center via AP)
news18-telugu
Updated: March 27, 2019, 4:22 PM IST
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ టౌన్‌లో ఒక చిత్రమైన ఘటన జరిగింది. అక్కడ ఉన్న ఓ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో పనిచేసే 9 మంది నర్సులు ఒకేసారి గర్భవతులు అయ్యారు. అందరూ మరికొన్ని వారాల్లో ప్రసవించబోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం ఎనిమిది మంది నర్సుల గ్రూప్ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘బొనాంజా ఆఫ్ బేబీస్’ అంటూ ఆ పోస్ట్ చేసింది. వచ్చే ఏప్రిల్ నుంచి జూలై మధ్య వారంతా ప్రసవించబోతున్నారు. అందులో ఎవరెవరికి ఏయే నెలల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందో సూచిస్తూ కలర్ ట్యాగ్స్‌ను కూడా ఇచ్చింది. అందులో ముగ్గురికి పింక్, బ్లూ కార్డులు, ఇద్దరి పసుపు, ఒకరికి గ్రీన్ కలర్ కార్డును ఇచ్చారు. మెటర్నిటీ వార్డులో పనిచేసే వీరంతా తమ కొలీగ్స్‌ డెలివరీకి సాయపడడానికి సిద్ధంగా ఉన్నారు.

First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...