నిక్కీ హేలీ రాజీనామా: ఐరాసలోకి ట్రంప్ కూతురు ఇవాంకా!

‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో.’

Ashok Kumar Bonepalli | news18-telugu
Updated: October 10, 2018, 2:23 AM IST
నిక్కీ హేలీ రాజీనామా: ఐరాసలోకి ట్రంప్ కూతురు ఇవాంకా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ (AP Photo/Seth Wenig)
  • Share this:
ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా ఆమె సడన్‌గా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆమె రాజీనామాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమోదించడం విశేషం. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ వాదనను నిక్కీ హేలీ కొట్టిపారేశారు. కానీ, తాను రిజైన్ ఎందుకు చేశారో మాత్రం ఆమె చెప్పలేదు.

‘నిక్కీ హేలీ చాలా స్పెషల్. ఆమెను వదులుకోవాలని లేదు. రెండేళ్ల పదవీ కాలం చివర్లో కొన్ని రోజులు విశ్రాంతి కావాలని అడిగింది. ఏ ఏడాది చివరి వరకు ఉంటుంది. కొన్ని వారాల్లోనే నిక్కీ హేలీ వారసురాలు ఎవరో నిర్ణయిస్తాం.’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్‌గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్‌కే ప్రచారం చేస్తా.’ అని నిక్కీ హేలీ ప్రకటించారు.

హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్ సదస్సుకు హాజరైన ఇవాంకా ట్రంప్
హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్ సదస్సుకు హాజరైన ఇవాంకా ట్రంప్


నిక్కీ హేలీ వారసులు ఎవరు?
నిక్కీ హేలీ తర్వాత ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఎంపికవుతారని తెలుస్తోంది. ఈ దిశగా ట్రంప్ కూడా సంకేతాలు ఇచ్చారు. ‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో.’ అని ట్రంప్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇప్పటికే ట్రంప్‌కి సలహాదారుగా వైట్ హౌస్‌లో ఇవాంకా చక్రం తిప్పుతున్నారు. అయితే, ఇవాంకాకి అత్యంత సన్నిహితురాలు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు అయిన దీనా పోవెల్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 10, 2018, 2:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading