NIKE SNEAKERS WHICH IS SPECIALLY DESIGNED FOR AMERICAN FORMER PRESIDENT BARACK OBAMA GOES ON SALE MS
Barack Obama Shoes: ఒబామా వాడిన షూస్ వేలం... ధర ఎంత తెలుసా..?
ఒబామా వాడిన షూ వేలం
నైకీ (Nike) సంస్థ ఆయనకోసం ప్రత్యేకంగా షూస్ ను తయారుచేసి ఇచ్చింది. 2009 లో ఈ బూట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా (Obama) అధికారిక కార్యక్రమాలకు మినహాయిస్తే మిగతాచోటకు ఎక్కడకు వెళ్లినా వాటిని వేసుకునేవారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమెరికా 44 వ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన అధినేత. అగ్రారజ్యాధినేతగానే గాక ఆయన వ్యక్తిత్వానికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు ఒబామా. అయితే ఆయన అధికారంలో ఉండగా ఒబామా కోసమే ప్రత్యేకంగా రూపొందించుకున్న షూ లు ఇప్పుడు వేలం వేయనున్నారు.
రాజకీయాలతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న నాయకుడు ఒబామా. 1989 లో ఆయన ఒక ఫుట్ బాల్ కప్పును కూడా గెలుచుకున్నారు. ఆయనకు బాస్కెట్ బాల్ అంటే మక్కువ ఎక్కువ. దాంతో నైకీ (Nike) సంస్థ ఆయనకోసం ప్రత్యేకంగా షూస్ ను తయారుచేసి ఇచ్చింది. 2009 లో ఈ బూట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్లినా వాటిని వేసుకునేవారు. కాగా.. ఈ బూట్లను ఇప్పుడు వేలం వేయనున్నది నైకీ.
సెలబ్రిటీలు, రాజ్యాధినేతలు వేసుకునే దుస్తులు, వాళ్లు వాడిన వస్తువులను వేలం వేయడం ఎప్పటినుంచో వస్తున్న విషయమే. అయితే తాజాగా ఒబామా బూట్లను కూడా శుక్రవారం వేలం వేయనుంది నైకీ సంస్థ.
Coming to Sotheby's this President’s Day Weekend! President Barack #Obama Player Exclusive Nike Hyperdunk—one of two pairs in existence —for immediate purchase this Friday at 4:44 PM EST, in celebration of America’s 44th President. #Sneakers#PresidentsDayhttps://t.co/s92RVU9L1m
వీటి ధరను 25 వేల యూఎస్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 18 లక్షల (రూ. 18,21,575) పైమాటే. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 44 సైజు ఉన్న ఈ షూ.. తెల్ల రంగు లో ఉన్నవి. ఒబామాకు ఇవి ఎంతో ఇష్టమైన స్నీకర్లు. ఈ షూలలో ఫ్లై వేర్ టెక్నాలజీ కూడా ఉంది. అంతేగాక వీటిపై ఒబామా సంతకం కూడా ఉంటుంది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.